థియేటర్లలో సెన్సేషనల్ రన్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన పుష్ప 2 ఇక ఓటిటిలోకి రానుంది.భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ అన్ని భాషలకు ఈసినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది.ఇక 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత పుష్ప 2ను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.జనవరి 30న ఈసినిమా సౌత్ భాషల్లో అందుబాటులోకి రానుంది.హిందీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు.అక్కడ ఇంకా సూపర్ రన్ కొనసాగిస్తోంది.దాంతో నెట్ ఫ్లిక్స్ ఆలస్యంగా హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయనుంది.ఇటీవలే థియేటర్లలో ఈసినిమాకు అదనంగా 20 నిమిషాల సీన్ల ను యాడ్ చేసి రీలోడ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు.ఓటిటి కోసం ఈ రీలోడెడ్ వెర్షన్ కు అదనంగా మరో 3 నిమిషాల ఫుటేజ్ ని జత చేశారు.అంటే టైటిల్ క్రెడిట్స్ తో కలిపి మొత్తం 3 గంటల 44 నిమిషాల రన్ టైం తో ఈసినిమా స్ట్రీమింగ్ లోకి రానుంది.దాంతో అత్యధిక రన్ టైం తో వచ్చిన సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వ్యూస్ పరంగాను ఈసినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఎందుకంటే రీ లోడెడ్ వెర్షన్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు.దాంతో చాలా మంది మిస్ అయ్యారు.ఇక ఇప్పుడు ఓటిటి లోకి వస్తుడడంతో మరోసారి అందరూ తప్పకుండా ఓ షో వేయడం గ్యారెంటీ.ఆలెక్కన భారీ వ్యూయర్ షిప్ సొంతం చేసుకోనుంది.గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా బాహుబలి 2 రికార్డు లను బ్రేక్ చేసి 1850 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా చరిత్ర సృష్టించింది.నార్త్ లోనైతే రాంపేజ్ కొనసాగించింది.దాదాపు 830 కోట్లకు వసూళ్లను రాబట్టి ఆల్ టైం గ్రాసర్ గా రికార్డు నెలకొల్పింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా రష్మిక హీరోయిన్ నటించింది.రావు రమేష్ ,జగపతి బాబు ,అజయ్ ,కేశవ కీలక పాత్రల్లో నటించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: