గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుంటూ ఏకంగా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.రీసెంట్ గా పుష్ప 2 ఓటిటిలోకి కూడా వచ్చింది.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.అయితే ఇంతా భారీ విజయం సాధించిన కూడా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఒక్కటి కూడా జరుపలేదు.దానికి కారణం సినిమా రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన.దాంతో అటు అల్లు అర్జున్ కూడా ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కాస్త ఆలస్యమైనా పుష్ప 2 టీం ఈరోజు థాంక్యూ మీట్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.వేదిక ఎక్కడ అనేది మాత్రం రహస్యంగానే ఉంచారు.ఈవెంట్ కు ఫ్యాన్స్ కు అనుమతి లేదు.పుష్ప 2 కి పనిచేసిన సాంకేతిజ నిపుణులు ,నటినటులు మాత్రమే ఈవెంట్ కు హాజరుకానున్నారు.టైట్ సెక్యూరిటీ మధ్య ఈవెంట్ జరగనుంది. అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ కానున్నాడు.సంధ్య థియేటర్ ఘటన తరువాత అల్లు అర్జున్ హాజరుకానున్న మొదటి ఈవెంట్ ఇదే.దాంతో అల్లు అర్జున్ ఏం మాట్లాడుతాడోనని ఆసక్తి నెలకొంది.ఈ సాయంత్రం ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది.
పుష్ప 2ను సుకుమార్ డైరెక్ట్ చేయగా రష్మిక హీరోయిన్ నటించింది.రావు రమేష్ ,జగపతి బాబు ,అజయ్ ,కేశవ కీలక పాత్రల్లో నటించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: