ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప-2’ ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇండియన్ సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప-2’ సరికొత్త రికార్డులు సృష్టించింది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈచిత్రం థ్యాంక్స్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకలో చిత్రం యూనిట్ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ చేతుల మీదుగా షీల్డులు బహుకరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ ” మైత్రీ మూవీస్ చెర్రీ సలహాతోనే పుష్పను రెండు భాగాలుగా చేశాను. ఆయన సలహా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాకు రంగస్థలం నుంచి ఇప్పటి వరకు వరుస హిట్స్ రావడానికి మైత్రీ మూవీస్ కారణం. ఈ విజయం వాళ్లదే. నాపేరు సుకుమార్ కాదు.. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి లేకుండా నేను సినిమా చేయలేను. భవిష్యత్‌లో కూడా చేయలేను.” అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇక అల్లు అర్జున్ నాకు ఎంతో ఎనర్జీ ఇస్తాడు. ఈ ప్రపంచంలో నన్ను ఓ అద్బుతంలా భావించే వ్యక్తి అల్లు అర్జున్. నన్ను నమ్మే వ్యక్తి. నా దగ్గర సరైన కథ లేకుండా బన్నీ ఓకే అన్నాడు. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్‌దే. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్‌ఫార్మె చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది అని ప్రతి సన్నివేశం ముందు చెప్పేవాడిని. ఈరోజు ఆయన నటనకు ఎంతో మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇటీవల ఓ పెద్దాయన అల్లు అర్జున్‌ను నటనలో ఎస్వీ రంగారావుతో పోల్చాడు.” అని తెలిపారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: