ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా రానుందని తెలిసిందే.నిజానికి పుష్ప 2 తరువాతే ఈసినిమా ఉంటుందనుకున్నారు కానీ మధ్యలో అల్లు అర్జున్ మరో సినిమా చేయనున్నాడు.ఆ తరువాత త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.ఇక ఈసినిమా గురించి నాగవంశీ సూపర్ అప్డేట్ ఇచ్చారు. ఈసినిమా మైథలాజికల్ మూవీ గా తెరకెక్కనుందని సినిమా వచ్చాక దేశం అంతా షాక్ అవుతుందని అన్నారు. అలాగే రామాయణం ,మహాభారతం కాకుండా వేరే దేవుడి గురించి ఈసినిమా వుండనుందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో నాగవంశీ చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ కానుంది.తమన్ ఈసినిమాకు సంగీతం అందించనుండగా భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నాయి.2027లో థియేటర్లలోకి రానుంది.
ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేయనున్నాడు.ఎప్పటి నుండో ఈ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్తలు రాగ ఫైనల్ గా ఆ న్యూస్ కానుంది. అయితే అఫీషియల్ అప్డేట్ రావాల్సివుంది. అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8న ఈ సినిమా అనౌన్స్ మెంట్ రానుంది.సన్ పిక్చర్స్ నిర్మించనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.ఇందులో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: