వచ్చే నెలలో మోస్ట్ అవైటెడ్ మూవీ గా వస్తుంది నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్.రిలీజ్ కు ఇంకా వారం రోజులే వుంది.సాంగ్స్ ,ట్రైలర్ తో సినిమాకు సూపర్ హైప్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా నిన్న చెన్నై లో ఈవెంట్ చేసి తమిళ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఈరోజు ముంబై లో హిందీ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక తెలుగులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.రేపు హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరుగనుండగా దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడు.పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న ఈవెంట్ ఇదే.దాంతో ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడుతాడో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.మొత్తానికి అల్లు అర్జున్ రాకతో తండేల్ మరింతగా జనాల్లోకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తండేల్ 2గంటల 32 నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది.సోలోగా విడుదలకావడం సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.హిట్ టాక్ వస్తే చైతన్య కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా కానుంది.అయితే తమిళంలో మాత్రం తండేల్ కు పోటీ ఎదురుకానుంది.అక్కడ ఒక్క రోజు ముందు అజిత్, విడా ముయార్చి రిలీజ్ అవుతుంది.
శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొడేంటి ఈసినిమాను తెరకెక్కించగా ఇందులో నాగ చైతన్య మత్స్యకారుడి గా కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: