ప్రైవేట్ సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకొని కోలీవుడ్ వరుస ఆఫర్లు కొట్టేస్తున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈరోజు తన 21వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతా ద్వారా విషెస్ చెప్పాడు.నా బ్రదర్ సాయి అభ్యంకర్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అల్లు అర్జున్ ట్వీట్ వేయడంతో AA22 x A6 సినిమాకు తనే మ్యూజిక్ డైరెక్ట్ అని ఫిక్స్ అవుతున్నారు అభిమానులు. ఇక ఇంతకుముందు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ కూడా డ్యూడ్ స్టేజ్ మీద ఇదే విషయాన్ని కంఫర్మ్ చేశాడు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో AA22 x A6 టీం నుండి ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇక ప్రముఖ గాయకులు టిప్పు మరియు హరిణిల తనయుడైన సాయి అభ్యంకర్, ‘కచ్చి సేరా’ వంటి ప్రైవేట్ సాంగ్స్ తో యూట్యూబ్‌లో సెన్సేషన్ అయ్యారు. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యింది.ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. తను మ్యూజిక్ అందించిన మొదటి చిత్రం డ్యూడ్ రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇందులో సాంగ్స్ కు సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ప్రస్తుతం అభ్యంకర్ పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు సంగీతం అందిస్తున్నాడు.అందులో సూర్య కరుప్పు ,లోకేష్ కనగరాజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బెంజ్ అలాగే ధనుష్ 55 సినిమాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























