రీ రిలీజ్ కానున్న ఆర్య 2

Arya 2 will re-release in theaters on April 5

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆర్య 2 రిలీజ్ చేయమని చాలా రోజులనుండి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్న విషయం తెలిసిందే. ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది.ఈనెల 5న ఆర్య 2 మళ్ళీ థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈనెల 7న అల్లు అర్జున్ తన బర్త్ డే జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా రెండు రోజుల ముందు ఆర్య 2 రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2009 లో భారీ అంచనాలతో వచ్చిన ఆర్య 2 అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది. కమర్షియల్ గా హిట్ అనిపించుకోలేకపోయినా ఈసినిమాకు చాలా మంది ఫ్యాన్స్ వున్నారు.ఇక ఆర్య 2 ఆడియో అయితే అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది.సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎస్విసిసి నిర్మించింది.మరి ఇన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ థియేటర్ల లోకి వస్తున్న ఆర్య 2 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఇక అల్లు అర్జున్ బర్త్ డేన తన నెక్స్ట్ మూవీస్ గురించి అప్డేట్స్ రానున్నాయి.అందులో భాగంగా పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అలాగే త్రివిక్రమ్ తో కూడా అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడు.మైథలాజికల్ మూవీ గా రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.