ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 …51 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రీసెంట్ గా 20 నిమిషాల సీన్లను యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తో రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం చూసిన వారు మరోసారి థియేటర్లకు వస్తున్నారు.ఇక ఈసినిమా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య 70ఎమ్ఎమ్ థియేటర్ లో ఆల్ టైం రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
51రోజుల్లో 206 షోల ద్వారా 1,04,580 మంది వీక్షించగా 1,89,75,880 గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. ఇక ఈసినిమా 56 రోజుల థియేట్రికల్ రన్ తరువాతే ఓటిటిలోకి రానుంది. అన్ని భాషలకు గాను డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 1850 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ఈసినిమా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించగా హిందీలో 800కోట్లకుపైగా వసూళ్లతో ఆల్ టైం గ్రాసర్ గా ఘనత సాధించింది.
ఇక ఈసినిమా తరువాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా.సమ్మర్ లో ఈ సినిమా లాంచ్ కానుంది. భారీ బడ్జెట్ తో హారికా హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ నిర్మించనున్నాయి.వచ్చే ఏడాది చివర్లో థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: