క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఓటీటీ లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,871కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదిరిపోయే కలెక్షన్స్‌తో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అందుకుంది. తద్వారా దేశవ్యాప్తంగా హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తొలి తెలుగు సినిమాగా నిలిచి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కాగా రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాహుబలి 2 ఇప్పటివరకూ మొదటి స్థానంలో వుండగా.. పుష్ప 2 ఇప్పుడు దీనిని దాటేసింది. అయితే ఓవరాల్‌గా మాత్రం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ 2,000 కోట్లతో మొదటిస్థానంలోవుంది.
ప్రధానంగా ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే అక్కడ హైయెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. త్వరలోనే కేవలం హిందీ వెర్షన్‌లో రూ.1,000కోట్ల మార్కును అవలీలగా అందుకుంది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం దుమ్ము రేపి కళ్ళు చెదిరే వసూళ్లను అందుకుంది. ప్రధానంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రభంజనమే సృష్టిచింది. 15 మిలియన్లకు పైగా కలెక్షన్స్ కళ్లజూసి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్‌కు కాసుల వర్షం కురిపించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా రష్మిక హీరోయిన్ నటించింది. రావు రమేష్, జగపతి బాబు, అజయ్, కేశవ కీలక పాత్రల్లో నటించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించగా.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: