దేశవ్యాప్తంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన కలకలం సృష్టించింది. నిన్న గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది. ఇక్కడినుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, గాల్లోకి లేచిన కొద్ది నిమిషాలకే దగ్గరలోని ఒక మెడికల్ కాలేజీ క్యాంపస్ లోని భవనంపై కుప్పకూలిపోయింది. దీంతో విమానంలోని 241 మందితో పాటు ఆ భవనంలోని వైద్య విద్యార్థులు మరో 24 మంది మొత్తం 265 మంది దుర్మరణం చెందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇదే విమానంలో ప్రయాణించిన గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా మృత్యువాతపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ విమానంలోని ఒక ప్రయాణికుడు మాత్రం స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. అతడితోపాటు ఈ ప్రమాదం వలన గాయపడిన ఇతరులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలావుంటే, ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సహా అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు పలువురు స్పందించారు.
ఈ విమాన ప్రమాదంపై టాలీవుడ్ ప్రముఖులు పలువురు స్పందించారు. ఈ ప్రమాదం తమ మనసులను కలిచివేసిందని పేర్కొన్న ఈ స్టార్స్, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. వీరిలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విష్ణు మంచు తదితరులున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, సన్నీ డియోల్, రితేష్ దేశ్ ముఖ్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇంకా హీరోయిన్స్ జాన్వీ కపూర్, అలియా భట్, దిశా పటాని, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: