గత ఏడాది చివర్లో థియేటర్లలో విడుదలై ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య ఈసినిమా విడుదలకాగా మొదటి రోజు ఏకంగా 294 కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఫుల్ రన్ లో 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి బాహుబలి 2 ను క్రాస్ చేసింది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.ఆ తరువాత పుష్ప 2 దాదాపు మూడున్నర గంటల రన్ టైం తో ఓటిటి లోకి వచ్చింది.ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కొన్ని రోజుల క్రితం పుష్ప 2 తెలుగు వెర్షన్ ను స్టార్ మా లో మొదటి సారి ప్రదర్శించగా 12.61 టీఆర్ఫీ ని రాబట్టుకుంది.రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ రేటింగ్స్.అయితే అల్లు అర్జున్ గత చిత్రాలు పుష్ప పార్ట్ 1 మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 22.50 టీఆర్పీ ని రాబట్టగా అల వైకుంఠపురములో టివి ప్రీమియర్ 29.40 టీఆర్పీ ని రాబట్టింది.ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.
పుష్ప 2 ను సుకుమార్ డైరెక్ట్ చేయగా రష్మిక హీరోయిన్ గా నటించింది.రావు రమేష్ ,జగపతి బాబు ,అజయ్ ,కేశవ కీలక పాత్రలు పోషించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ అట్లీ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈసినిమా జూన్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: