పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. కుదిరితే ఈసినిమాను ఉగాదికి లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను తీసుకున్నారట. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేశానని తమన్ అన్నాడు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అడుగగా తమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు అల వైకుంఠపురములో సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ క్రీయేట్ చేసింది.దాంతో మరోసారి తమన్ నే తీసుకున్నారు.ఇక అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబో లో ఇది మూడో సినిమా.వీరి కాంబోలో ఇంతకుముందు జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో రాగ అన్ని సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమా రానుంది. గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నాయి. వచ్చే ఏడాది చివర్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇదిలావుంటే గత ఏడాది పుష్ప 2 తో వచ్చి చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకుపైగా వసూళ్లతో ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డుల్లోకి ఎక్కింది.సుకుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























