ట్యాగ్ · 38 కథనాలు · పేజీ 2
బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
మళ్లీ మొదలుపెట్టిన 'పుష్ప' రాజ్
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!

'పుష్ప' షూట్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్

'పుష్ప' అనుకున్న టైమ్ కే పార్ట్ 1 షూటింగ్ పూర్తి..!

"పుష్ప " లో యాక్షన్ సీన్ వన్ ఆఫ్ ది హైలైట్
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో
పిల్లలతో సరదాగా 'బన్నీ'
వర్చ్యువల్ గా కథలు వింటూ అల్లు అర్జున్ బిజీ
నేను కోలుకుంటున్నా - అల్లు అర్జున్
అల్లు అర్జున్ డ్యాన్స్ కు అభిమాని

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు
మన సినిమాలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఇక మన మేకర్స్ మలయాళంలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు రీమేక్ చేసుకుంటున్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్, లవ్ మాక్ టైల్ ఇంకా చాలా సినిమాలే రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా హక్కులు కూడా టాలీవుడ్ స్టార్ హీరో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్.
బన్నీ తో యానిమేషన్ సినిమా తీయాలి..!
ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో హీరోతో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు.. ఎప్పటినుండో ఉన్న సంప్రదాయమే. ఇక ఇక్కడ ఒక డైరెక్టర్ కు యానిమేషన్ తరహా సినిమా చేయాలని.. అది కూడా ఓస్టార్ హీరోతో చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడట. ఇంతకీ ఆహీరో.. ఆ డైరెక్టర్ ఎవరంటే.. కామెడీ చిత్రాలకు కమర్షియల్ హంగులు అద్ది కొత్తరకం కామెడీని అందించిన డైరెక్టర్ మారుతి. మారుతికి ఎప్పటినుండో హాలీవుడ్ లోని అల్లావుద్దీన్ తరహా యానిమేషన్ సినిమా చేయాలని ఉందట... అదికూడా స్టార్ హీరో అల్లు అర్జున్ తో. నిజానికి అల్లు అర్జున్ కు యానిమేషన్ సినిమాలు అంటే చాలా కష్టం…

"పుష్ప" మూవీ లో విలన్ గా సోనూసూద్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “మూవీ పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అల్లు అర్జున్ స్టైలిష్ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైలిష్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లు అర్జున్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో తెలుగు , మలయాళ ప్రేక్షకులనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. 2020 సంవత్సరం బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ మూవీ లో నటిస్తున్నారు.
మళ్లీ మొదలుపెట్టిన 'పుష్ప' రాజ్
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'పుష్ప'. లాక్ డౌన్ కు ముందే ఈసినిమా చాలావరకూ షూటింగ్ ను జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. కరోనా సెకండ్ వేవ్ వచ్చినా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ జరిపినా కూడా ఆఖరికి బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మళ్లీ ఇన్ని రోజులకు సెట్స్ పైకి వచ్చారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి…

గోవా లో "పుష్పరాజ్" ఇంట్రడక్షన్ సాంగ్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ”పుష్ప “మూవీ లో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
ఈమధ్య సినిమాల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకూ కథలోనే కాదు తమ లుక్ విషయంలో కూడా సినిమా సినిమాకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫార్ములాను అల్లు అర్జున్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలోనే తన డీగ్లామర్ లుక్ లోకి మారిపోయి కొత్తగా ట్రై చేస్తున్నాడు. పుష్ప లుక్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఐకాన్ కోసం కూడా సాలిడ్ లుక్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.

'పుష్ప' షూట్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూడో సినిమా పుష్ప. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా అవి హిట్టవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దానికి తోడు ఈసినిమా కేవలం ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ అంటూ.. ఓ నిమిషంన్నర వీడియో మాత్రమే రిలీజ్ కాగా ఆ వీడియోనే రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. ఇప్పటి వరకూ తీసిన షూటింగ్ పార్ట్ 1 కు దాదాపు సరిపోతుంది.. అయితే మరికొన్ని రోజులు షూటింగ్ ను చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి ఈసినిమా షూటింగ్ ను కూడా…

'పుష్ప' అనుకున్న టైమ్ కే పార్ట్ 1 షూటింగ్ పూర్తి..!
సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాపుష్ప . సుకుమార్-బన్నీ కాంబినేషన్ కాబట్టి మొదటి నుండి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా గురించి వచ్చే రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వింటుంటే మాత్రం సినిమా ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు రిలీజ్ అవతుందా.. ఎప్పుడు చూడాలా అన్న ఎగ్జైట్ మెంట్ అయితే పెంచుతున్నారు చిత్రయూనిట్. బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా ఫుస్ రస్టిక్ లుక్ లో కనిపించడం.. ఇంకోవైపురెండు పార్ట్ లుగా రావడం.. ఇలా ఒకటేమిటీ అన్ని అంశాలు సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎలాగూ ఉంటాయన్న సంగతి తెలిసిందే.. అయితే మరో సాలిడ్ యాక్షన్ నైట్…

"పుష్ప " లో యాక్షన్ సీన్ వన్ ఆఫ్ ది హైలైట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్, జగపతి బాబు , అనసూయ ముఖపాత్రలలో నటిస్తున్నారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అల్లు అర్జున్ బాలీవుడ్ ప్లాన్స్
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి భాగం ఆగస్ట్ 13 వ తేదీ, రెండవ భాగం 2022 సంవత్సరం లో రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.“పుష్ప “మూవీ తెలుగు భాషతో పాటు కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.
బన్నీ తగ్గేదేలే - మూడు కన్ఫామ్.. మూడు లైన్ లో
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోలు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక బన్నీ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటి వరకూ స్టైలిష్ పాత్రల్లో నటించిన బన్నీ ఈ సినిమాలో అతడు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. అంతేకాదు, చిత్తూరు యాసను కూడా మాట్లాడుతున్నాడు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి ఇందులో మొదటి భాగం దసరాకు గానీ సంక్రాంతికి గానీ విడుదల కాబోతుందని టాక్.
పిల్లలతో సరదాగా 'బన్నీ'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇక ఇప్పుడు కరోనా వల్ల షూటింగ్ లు కూడా లేవు.. దీంతో ఫ్యామిలీతో గడిపే టైమ్ మరింత దొరికింది. ఈనేపథ్యంలో తన కూతురు, కొడుకు అయాన్, అర్హతో మంచిగా టైమ్ పాస్ చేస్తున్నారు. ఇక ఈ స్వీట్ మూమెంట్స్ ను ఎప్పటికప్పుడు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సతీమణి స్నేహా రెడ్డి. ఇప్పటికే అలాంటి స్వీట్ వీడియోస్ ఎన్నో తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన స్నేహా ఇప్పుడు మరో వీడియోను షేర్ చేసింది.
వర్చ్యువల్ గా కథలు వింటూ అల్లు అర్జున్ బిజీ
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫహాద్ ఫాజిల్ , ప్రకాష్ రాజ్, జగపతి బాబు , ధనంజయ్, సునీల్ , అనసూయ ముఖ్య పాత్రలలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
నేను కోలుకుంటున్నా - అల్లు అర్జున్
టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరుపొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
అల్లు అర్జున్ డ్యాన్స్ కు అభిమాని
"ఆర్య ", "దేశముదురు", "బద్రినాథ్ ", "రేసుగుర్రం ", "సరైనోడు ", "దువ్వాడ జగన్నాథం ", "అల .. వైకుంఠపురములో .. " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ తెలుగు , మలయాళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను డబ్బింగ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో…

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ 2007 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. "దేశముదురు " మూవీ లో హీరోయిన్ రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాక్షన్ సీన్స్ , సాంగ్స్ , అలీ కామెడీ ట్రాక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావుడి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అంటూనో.. ఆడియో రిలీజ్ అంటూనే.. సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఇలా నిత్యం హడావుడి.. బిజీ బిజీ గా ఉంటుంది. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. సెలబ్రిటీస్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ తాజాగా తమ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.