టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరుపొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమ అభిమాన హీరో అల్లు అర్జున్ కరోనా బారిన పడడంతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆందోళనకు గురిఅయ్యారు. ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ ను అల్లు అర్జున్ ఇచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందనీ , కరోనా లక్షణాలు మైల్డ్ గా ఉన్నాయనీ , కోలుకుంటున్నా ననీ , హోమ్ క్వారంటైన్ లో ఉన్నాననీ , ఎవరూ ఆందోళన పడవద్దనీ , త్వరగా కోలుకోవాలని ప్రేమని చూపిస్తూ , ప్రార్ధనలు చేస్తున్న అందరికీ ధన్యవాదాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ తో అభిమానులు రిలీఫ్ ఫీల్ అయ్యారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: