మహేష్ చేతుల మీదుగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీజర్ రిలీజ్

Super Star Mahesh Babu Unveils WWW Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Mahesh Babu,WWW,WWW Movie,WWW Movie Teaser,Mahesh Launches The Teaser Of WWW,WWW Movie Official Telugu Teaser,Adith Arun,Shivani Rajashekar,Ramantra Creations,KV Guhan,Www,WWW Official Telugu Teaser,WWW Telugu Movie,WWW Telugu Movie Teaser,Mahesh Babu Unveils WWW Movie Teaser,Mahesh Babu Laatest News

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మరో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ కథతో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి `డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ` (హూ,వేర్‌,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే రానా చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా‌ టీజర్‌ను సంక్రాంతి సందర్బంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా సినిమా మంచి విజయం దక్కించుకోవాలని కోరుకుంటున్నా అని చిత్ర టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు మహేష్‌. టీజర్‌ని బట్టి చూస్తే సినిమా సైబర్‌ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. వైవా హర్ష, ప్రియదర్శి, దివ్య శ్రీపాద కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. సిమ‌న్ కె. కింగ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళంలోనూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కెమెరా మెన్‌గా పని చేసిన గుహన్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన మొదటి సినిమా 118. కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇక రెండో చిత్రంగా ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ సినిమా తో వస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =