
ట్యాగ్ · 21 కథనాలు


అక్టోబర్ లో గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'

తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ

'సీటీమార్' రిలీజ్ డేట్ ఫిక్స్

"#GOPICHAND 30" మూవీ లో విలన్ గా రాజశేఖర్ ?

19 ఏళ్ల జయం.. మరిచిపోలేని జ్ఞాపకం

"అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ అప్ డేట్
'సీటీమార్' టీజర్ కు టైమ్ ఫిక్స్
'పక్కా కమర్షియల్' అంటున్న మారుతి-గోపీచంద్
గోపీచంద్-మారుతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?
"సీటీమార్" షూటింగ్ పునః ప్రారంభం
"సీటీమార్" అప్ డేట్
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
కామెడీ ట్రాక్ హైలైట్ గా "సీటీ మార్ "
ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "వర్షం "
గోపీచంద్ సాహస నిర్ణయం

విలన్ గా నటించడానికి సిద్ధమే - గోపీచంద్
“తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.

గోపీచంద్ , శ్రీవాస్ ల హ్యాట్రిక్ మూవీ రేపే ప్రారంభం
సూపర్ హిట్ "సీటీ మార్ "మూవీ తో ప్రేక్షకులను అలరించిన యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పక్కా కమర్షియల్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గోపీచంద్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు శ్రీవాస్ , హీరో గోపీచంద్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ కి ముహూర్తం కుదిరింది.

అక్టోబర్ లో గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్'
యాక్షన్ హీరో గోపీచంద్ ఎంతో కాలం నుండి మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే చాలా కాలం తరువాత సీటీమార్ తో మంచి విజయం దక్కించుకున్నాడు. ఇక ఇదే జోష్ తో ఎన్నో యేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరడుగుల బుల్లెట్ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ ". ఇప్పటికే రెండు మూడుసార్లు ఈసినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందు జూన్ అనుకున్నారు.. ఆ తరువాత ఆగష్ట్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఇక ఫైనల్ గా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ రిలీజ్ అంటూ ఒక పోస్టర్…

తేజ సినిమాపై గోపీచంద్ క్లారిటీ
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ , తమన్నా కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా చేస్తుండగానే తేజ తో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాకు అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి ప్రకటించారు. అయితే ఆతరువాత ఈసినిమా గురించి పెద్దగా ఎక్కడా వినిపించలేదు.

'సీటీమార్' రిలీజ్ డేట్ ఫిక్స్
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్న సినిమాలు వరుసగా రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇక ఈ నెలలోనే ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఆగష్ట్ 27న కూడా పలు సినిమాలు పోటీకి సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు సెప్టెంబర్ మొదటి వారం కూడా ఫుల్ గా బుక్ అయిపోయింది. ఇప్పటికే పలు సినిమాలు సెప్టెంబర్ 3వ తేదీని బుక్ చేసుకోగా ఇప్పుడు మరో సినిమా కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఆ సినిమా మరేదో కాదు ఎప్పటినుండో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సీటీమార్.

"#GOPICHAND 30" మూవీ లో విలన్ గా రాజశేఖర్ ?
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా " సీటీమార్ " విడుదలకు సిద్ధంగాఉంది. బి గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ ,నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ "మూవీ కూడా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "పక్కా కమర్షియల్ "మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

19 ఏళ్ల జయం.. మరిచిపోలేని జ్ఞాపకం
అప్పట్లో యూత్ ను ఆకట్టుకునే సినిమాలు తీయడంలో డైరెక్టర్ తేజ పేరు ముందుండేది. అలా తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజ డైరెక్షన్‌లో ఆర్పీ పట్నాయక్ సంగీతంతో అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ సినిమా అటు డైరెక్టర్ తేజ తో పాటు నితిన్, సదా, ఆర్పీకి వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. బెస్ట్ డెబ్యూ హీరోగా నితిన్, హీరోయిన్‌గా సదా ఫిల్మ్ ఫేర్ అవార్టులు అందుకున్నారు. ఇక సదా చెప్పే ‘వెళ్లవయ్యా వెళ్లు.. వెళ్లూ..’ అంటూ చెప్పే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఈసినిమా విజయానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఆర్పీ పట్నాయక్ సంగీతం ఒకటి అని…

"అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ అప్ డేట్
యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో "అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ "నిజం ", "జయం " మూవీస్ లోనెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ ఇప్పుడు "అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ లో హీరోగా నటించడం విశేషం.
'సీటీమార్' టీజర్ కు టైమ్ ఫిక్స్
గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'సీటీమార్'. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో గౌతమ్ నందా అనే సినిమా వచ్చినా అది పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈసినిమాతో హిట్ కొట్టాలన్న ప్లాన్ లో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. టాకీ పార్ట్ వరకూ పూర్తి కాగా ఇంకా ఒకటి రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుస అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు.
'సీటీమార్' లో 'క్రాక్' భామ
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'థ్రిల్లర్' సినిమాలో నటించి ఆ సినిమాతోమంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది అప్సర రాణి. ఆ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే రవితేజ 'క్రాక్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన అప్సర రాణి ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు సెలెక్ట్ అయింది.
'పక్కా కమర్షియల్' అంటున్న మారుతి-గోపీచంద్
కమర్షియల్ సినిమాలకు కూడా తన మార్క్ కామెడీని జోడించి హిట్ కొట్టడంలో మారుతి ఎక్స్పర్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాయి ధరమ్ తేజ్ తో ప్రతీరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయిందనుకోండి. ఇక ఇప్పడూ మ్యాచో హీరో గోపీచంద్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గోపిచంద్ కు ఇది 29వ సినిమా కాగా.. మారుతికి 10వ సినిమా.
మారుతి-గోపీచంద్ సినిమా టైటిల్ ప్రకటనకు టైం ఫిక్స్
సాయి ధరమ్ తేజ్‌కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. ఇక తన తర్వాత సినిమా గోపీచంద్ తో తీస్తున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్ళలేదు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అది కూడా చాలా వెరైటీ గా రిలీజ్ డేట్ ను ప్రకటించాడు మారుతి. అక్టోబర్ 1నరిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
గోపీచంద్-మారుతి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సాయి ధరమ్ తేజ్‌కు `ప్రతీరోజు పండగే` వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాపే తీసుకున్నాడు. ఇటీవలే గోపీచంద్ తో తన తర్వాత సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఇక ఇంకా ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.. షూట్ మొదలుపెట్టలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించారు. గత రెండు వారాలుగా అందరూ సినిమా రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది.

పోల్ గేమ్ : యాక్షన్ హీరో గోపీచంద్ బెస్ట్ మూవీ ?
ఈతరం ఫిల్మ్స్ బ్యానర్ పై ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "యజ్ఞం " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో గోపీచంద్ తీక్షణ లుక్స్ , బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో గోపీచంద్ ప్రేక్షకులను అలరించారు.
"సీటీమార్" షూటింగ్ పునః ప్రారంభం
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటిమార్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ను ప్రేమించే అమ్మాయి పాత్రలో "హిప్పీ"మూవీ ఫేమ్ దిగాంగన నటిస్తుండగా రావు రమేష్ పోసాని , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో గోపీచంద్ , తమన్నా లు కబడ్డీ టీమ్ కోచ్ లుగా నటిస్తున్నారు.
"సీటీమార్" అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ ,తెలంగాణ కబడ్డీ టీమ్ కొచ్ గా తమన్నా నటిస్తున్నారు. "హిప్పీ " మూవీ ఫేమ్ దిగాంగన , సీనియర్ హీరోయిన్ భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
కామెడీ ట్రాక్ హైలైట్ గా "సీటీ మార్ "
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర మహిళా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ , తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. దిగాంగన , భూమిక , రెహమాన్ , అజయ్ , ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందించారు.
ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "వర్షం "
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "వర్షం "మూవీ 2004 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ , త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.ఈ మూవీ లో హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా "నువ్వొస్తానంటే "సాంగ్ ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటుంది.
గోపీచంద్ సాహస నిర్ణయం
యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా "సీటీమార్ " మూవీ షూటింగ్ నిలిచిపోయింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై తేజ దర్శకత్వంలో రూపొందనున్న "అలిమేలు వెంకట రమణ " మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.