కామెడీ ట్రాక్ హైలైట్ గా “సీటీ మార్ “

Comedy Track Going To Be Highlight In Seetimaar Movie

పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర మహిళా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ , తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. దిగాంగన , భూమిక , రెహమాన్ , అజయ్ , ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

60 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “సీటీ మార్ ” మూవీ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిమిత టీమ్ మెంబర్స్ తో “సీటీ మార్ ” మూవీ షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో తమన్నా కు అసిస్టెంట్ గా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. తమన్నా , వెన్నెల కిశోర్ ల మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరించేలా , మూవీ కి హైలైట్ గా నిలిచేలా దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశారని సమాచారం. దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా హీరోయిన్ గా నటించిన “రచ్చ “, “బెంగాల్ టైగర్ ” మూవీస్ ఘన విజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “సీటీ మార్ ” మూవీ రూపొందుతుంది.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + three =