
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 32

సౌత్ లో నటించాలని ఉంది -కియారా అద్వానీ

2.0 మూవీ చైనా లో భారీగా విడుదల

100కోట్ల బడ్జెట్ తో జయలలిత బయోపిక్ మూవీ

వికారాబాద్ లో షూటింగ్

'కోలీవుడ్' కి 'నేల టికెట్టు' భామ
నితిన్‌కి జోడీగా కీర్తి సురేష్?
బాలీవుడ్‌కి సామ్ చిత్రం
మరోసారి జట్టుకట్టనున్న వెంకీ, మహేష్

'మహానటి'కి మరో ఛాన్స్

రకుల్ సినిమాను రీమేక్ చేయనున్న వెంకీ!

'అశ్వద్ధామ' గా నాగశౌర్య

ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్

రిలీజయిన స్పెషల్ మూవీ ట్రైలర్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అఖిల్ ?
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూవీ రీసెంట్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మూవీ అఖిల్ కు 4వ మూవీ. సినిమా , సినిమా కు గ్యాప్ ఇవ్వకుండా సినిమాలలో నటించాలని అఖిల్ డిసైడ్ అయ్యారు. అఖిల్ నటించే తరువాత మూవీ కి సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. ఫాస్ట్ షెడ్యూల్స్ తో భాస్కర్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
చిరు చేతుల మీదగా 'పహిల్వాన్' ఫస్ట్ లుక్
ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనితోపాటు సుదీప్ ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నాడు.
సౌత్ లో నటించాలని ఉంది -కియారా అద్వానీ
కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందిన హిందీ మూవీ M.S ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ ఘనవిజయం సాధించింది. తరువాత లస్ట్ స్టోరీస్ మూవీ లో నటించిన కియారా కు ఆఫర్స్ వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కియారా జంటగా నటించిన భరత్ అనే నేను మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కియారా హీరోయిన్ గా నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్, షేర్ షాన్ , ఇందు కి జవానీ హిందీ మూవీ షూటింగ్స్ లో కియారా బిజీగా ఉన్నారు.

2.0 మూవీ చైనా లో భారీగా విడుదల
శంకర్ S దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 2.0. 2018 సంవత్సరం నవంబర్ 29 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ రోబో మూవీ కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. అమీ జాక్సన్ కథానాయిక కాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు.

100కోట్ల బడ్జెట్ తో జయలలిత బయోపిక్ మూవీ
అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి తమిళనాడు ప్రజల హృదయాలలో చిరస్థాయి గా నిలిచిన దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ చేశారు. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో AL విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తలైవి మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో 100కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది.
ధనుష్ ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ ట్రైలర్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడైనా కానీ అవేమీ పట్టించుకోకుండా వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్. తన నటన, ఫైట్లు, డ్యాన్స్‌లతో తమిళ ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో కూడా ధనుష్ కు మంచి అభిమానులు ఉన్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ‘రాన్‌ఝానా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన సత్తా చాటాడు. అలా తమిళ్, తెలుగు, హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. హాలీవుడ్‌కు వెళ్తున్న సంగతి కూడా తెలిసిందే.

వికారాబాద్ లో షూటింగ్
SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరో గా సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ మూవీ డిస్కో రాజా రూపొందుతుంది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. 3వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీ లో రవితేజ, వెన్నెల కిషోర్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. 4, 5 తేదీలలో వికారాబాద్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

'కోలీవుడ్' కి 'నేల టికెట్టు' భామ
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్టు' గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన మోడల్ మాళవిక శర్మ నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా మాళవిక శర్మకు మాత్రం యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కింది. అయితే ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ వచ్చిన మాళవికకు ఇటీవలే మెగా హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి తేజ్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటించనున్నట్టు తెలుస్తోంది.

నైజాంలో దూసుకుపోతున్న ఫలక్ నుమా దాస్
విశ్వక్ సేన్ దర్శక నిర్మాతగా తెరకెక్కిన సినిమా ఫలక్ నుమా దాస్. మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్.. కాస్త అభ్యంతర పదాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చకపోయినా.. నైజాంలో మాత్రం ఈ సినిమా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు విజయ దేవరకొండ ఫ్యాన్స్ కు విశ్వస్ సేస్ మధ్య మాటల యుద్దం కూడా కొనసాగుతుంది. ప్రెస్ మీట్ లు పెట్టి మరీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు వార్నింగ్ లు ఇస్తున్నాడు విశ్వక్ సేన్. ఇది కూడా సినిమా ప్రమోషన్ లాగా బాగానే ఉపయోగపడింది.
నితిన్‌కి జోడీగా కీర్తి సురేష్?
‘మహానటి’ (2018) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కీర్తి సురేష్ మళ్ళీ తెలుగు చిత్రంలో కనిపించిందే లేదు. అయితే… నేరుగా కాకపోయినా గతేడాది ‘సామి’, ‘పందెంకోడి 2’, ‘సర్కార్’ వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కీర్తి. తెలుగు చిత్రం కోసం ఏడాదికి పైనే గ్యాప్ తీసుకున్న కీర్తి… ప్రస్తుతం నా నువ్వే, 118 చిత్రాల నిర్మాత మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే… తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.
‘సాహో’లో ‘ఆర్ ఎక్స్ 100’ భామ?
‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్‌కు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఓ వైపు హీరోయిన్గా వైవిధ్యమైన పాత్రలున్న చిత్రాల్లో నటిస్తూనే… మరోవైపు ఐటమ్ సాంగ్స్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ‘సీత’ సినిమాలో “బుల్ రెడ్డి” పాటలో నర్తించిన పాయల్… ఇప్పుడు మరో భారీ బడ్జెట్ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందని టాక్.
బాలీవుడ్‌కి సామ్ చిత్రం
ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చిత్ర పరిశ్రమలో షరా మామూలే. అయితే… రిలీజ్ కూడా కాని ఓ తెలుగు సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోసారి జట్టుకట్టనున్న వెంకీ, మహేష్
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి జట్టు కట్టనున్నారు. అయితే ఈ సారి వెండితెరపై కాదు క్రికెట్ మైదానంలో ఈ ఇద్దరు కథానాయకులు సందడి చేయనున్నారు.

'మహానటి'కి మరో ఛాన్స్
మహానటి సినిమా ఘన విజయం తరువాత తెలుగులో కీర్తి సురేష్ ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న కీర్తి సురేష్ ఇటీవలే ఓ లేడి ప్రాధాన్యత ఉన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ మహానటి తెలుగులో మరో ఛాన్స్ కొట్టేసింది. ఆమె మరో లవ్ స్టోరీకి ఓకే చెప్పేసినట్టుగా సమాచారం.

రకుల్ సినిమాను రీమేక్ చేయనున్న వెంకీ!
తెలుగులో హిట్ అయిన సినిమాను హిందీలో.. హిందీలో హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడం ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమా రీమేక్ అవ్వనుంది. అజయ్ దేవగణ్, రకుల్,టబు హీరోహీరోయిన్లుగా నటించిన దే దే ప్యార్ దే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈసినిమా అక్కడ. భార్యను వదిలేసి యంగ్ లేడీ ప్రేమలో పడ్డ మిడిల్ ఏజ్ మెన్ గా అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో నటించాడు. ఇక రకుల్ కు కూడా ఈసినిమాతో బాలీవుడ్ లో హిట్ దొరికింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

'అశ్వద్ధామ' గా నాగశౌర్య
'నర్తనశాల' సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వం లో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లె దే కథానాయికలు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఈసారి క్రైమ్ డ్రామా అంటున్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్
'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా. అప్పటి వరకూ ఒకే ధోరణిలో ఉన్న సినిమాలు చూసి విసిపిపోయిన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకోండి. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. సందీప్ వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఎన్జీకే ఫస్ట్' వీకెండ్ కలెక్షన్స్
సెల్వ రాఘవన్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఎన్జీకే(నంద గోపాల కృష్ణ). మే 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. మొదటి రోజు కెలక్షన్స్ బాగానే ఉన్నాయనిపించినా.. శనివారం, ఆదివారం మాత్రం కాస్త కలెక్షన్లు తగ్గినట్టే కనిపిస్తోంది. దీంతో ఫస్ట్ వీకెండ్ టోటల్ గ్రాస్ రూ. 20 కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే చెన్నైలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వస్తున్నట్టు…

రిలీజయిన స్పెషల్ మూవీ ట్రైలర్
నందా లాల్ క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో వాస్తవ్ దర్శకత్వంలో అజయ్ ప్రధాన పాత్రలో ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ క్యాప్షన్ తో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్పెషల్ జూన్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. పోలీస్ ఆఫీసర్ గా అజయ్ నటించిన ఈ మూవీ లో రంగా, అక్షత జంటగా నటించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన స్పెషల్ మూవీ కి NVS మన్యం సంగీతం అందించారు.