ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 31

"ఐ లవ్ యు" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

'రాజ్ దూత్' టీజర్ రిలీజ్
టాలెంటెడ్ డిజైనర్ బర్త్ డే సెలబ్రిటీల సందడి

కన్నడంలో కూడా తిప్పరా మీసం-ప్రీ లుక్ రిలీజ్

జగన్ లో ఎంతమార్పు అప్పుడలా..ఇప్పుడలా

అల్లు అర్జున్ మూవీ లో సుశాంత్

డియర్ కామ్రేడ్ - 50 రోజుల్లో

నా కొడుకు పేరు అర్జున్ రెడ్డి - సందీప్ వంగా

1200 స్క్రీన్స్ లో ‘గేమ్ ఓవర్’
అర్జునుడి విల్లులా - సుధీర్ బాబు డెడికేషన్

కంగనా విషయంలోనే ఎందుకు?

7 మూవీ మౌత్ టాక్
'వాల్మీకి' ప్రీ టీజర్ త్వరలో
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రిలీజ్ త్వరలో

హిప్పీ మూవీ మౌత్ టాక్
‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మహేష్ సరికొత్త పాత్ర?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ... ఈ నెల (జూన్) 24 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని మహేష్ పాత్ర తీరు తెన్నులకు సంబంధించి పలు కథనాలు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

"ఐ లవ్ యు" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
కన్నడ సూపర్ స్టార్ ఊపేంద్ర ఇప్పటివరకూ చేసిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓం, ఏ, సూపర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో సంచలనం సృష్టించాడు. ఉపేంద్ర నుంచి సినిమా వస్తుందంటే ఉండే అంచనాలే వేరు. కన్నడలో ఆయన నటించిన ప్రతీ సినిమా తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలెన్నో. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత మరో సెన్సేషన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తనదైన క్యారెక్టరైజేషన్ తో మనముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కన్నడలో వరుసగా భారీ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ చంద్రు దర్శకత్వంలో ఐ లవ్ యు అనే సినిమాతో ఎంటర్ టైన్ చేసేందుకు ఉంపేద్ర సిద్ధమౌతున్నాడు.

'రాజ్ దూత్' టీజర్ రిలీజ్
విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే నటుడు రియల్ స్టార్ శ్రీహరి. యాక్షన్ అయినా...సెంటిమెంట్ అయినా... పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తాడు. ఇక కామెడీ గురించి అయితే చెప్పనక్కర్లేదు... తెలంగాణ యాసలో మాట్లాడుతూ శ్రీహరి చేసే కామెడీకైతే పొట్ట చెక్కలవ్వాల్సిందే. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీహరి గత కొద్ది సంవత్సరాల క్రితమే అకాల మరణం చెందారు.
టాలెంటెడ్ డిజైనర్ బర్త్ డే సెలబ్రిటీల సందడి
కేవలం తెలుగు సినీ సెలబ్రిటీలకు మాత్రమే కాదు సౌత్ లోనే టాప్ హీరోయిన్ లకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు శ్రవ్య వర్మ. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మందన, పీవీ సింధూ, సైనా నెహ్వాల్.. అలాగే తమిళ్ లో త్రిష పులువురికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇక కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూనే శ్రవ్య వర్మ...ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మారింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు శ్రవ్య వర్మ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు.

కన్నడంలో కూడా తిప్పరా మీసం-ప్రీ లుక్ రిలీజ్
'నీదీ నాదీ ఒకే కథ', 'మెంటల్ మదిలో', 'అప్పట్లో ఒకడుండేవాడు' లాంటి వైవిధ్యభరితమైన సినిమాలతో మంచి గుర్తింపుతెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. అసుర మూవీ దర్శకుడు కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథా నాయకుడిగా తిప్పరా మీసం మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ సాఫ్ట్ లుక్ లో కనిపించిన శ్రీవిష్ణు.. ఈ సినిమాలోపూర్తి గడ్డంతో, మీసంతో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.

జగన్ లో ఎంతమార్పు అప్పుడలా..ఇప్పుడలా
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పూర్తిగా మారిపోయారని అంటున్నాడు సినీ హీరో జె.డి చక్రవర్తి. హిప్పీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు సినీ హీరో జె.డి చక్రవర్తి. ఆయన కీలకపాత్రలో నటించిన ’హిప్పీ’ చిత్రం గురువారం విడుదలైన మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏమిటి? అని విలేకరి జె.డి ని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అల్లు అర్జున్ మూవీ లో సుశాంత్
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని హీరో సుమంత్. తన తరువాతి సినిమా అప్డేట్స్ గురించి ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఈ వారంలో తాను కొన్ని అప్డేట్లు, అనౌన్స్మెంట్స్ చేస్తానని ప్రకటింటిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.. ఈ నేపథ్యంలోనే తాను ఈసినిమాలో నటిస్తున్నట్టు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

డియర్ కామ్రేడ్ - 50 రోజుల్లో
గీత గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈసినిమా గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా.. ఈ సినిమా రీలీజ్ డేట్ ను జులై 26కు మార్చారు.

నా కొడుకు పేరు అర్జున్ రెడ్డి - సందీప్ వంగా
సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అర్జున్ రెడ్డి ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ తో.. ఇప్పుడొస్తున్న సినిమాలకు ట్రెండ్ సెట్ గా నిలిచింది. ఇక ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు. షాహిద్ కపూర్, కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెలలో విడుదలకు సిద్దంగా ఉంది.

1200 స్క్రీన్స్ లో ‘గేమ్ ఓవర్’
అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ గేమ్ ఓవర్ రూపొందింది. తమిళ, తెలుగు భాషలలో రూపొందిన గేమ్ ఓవర్ మూవీ జూన్ 14 వ తేదీన రిలీజ్ కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రూపొందిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
అర్జునుడి విల్లులా - సుధీర్ బాబు డెడికేషన్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీని తెరకు పరిచయమైన సుధీర్ బాబు... ఆ తరువాత హీరోగా పలు విభిన్నమైన స్టోరీలు ఎంపికచేసుకుంటూ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు..సుధీర్‌బాబు అనగానే టాలీవుడ్ లో ముందు గుర్తోచ్చేది మాత్రం అతని ఫిజిక్. ఇక ఫిట్ నెస్ విషయంలో టాప్ హీరోలకు సైతం పోటీ ఇస్తుంటాడు సుధీర్. జిమ్ లో వర్కవుట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లకి విపరీతంగా క్రేజ్ రావటం విశేషం. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా మెస్ట్ డిజరబుల్ మెన్ లో టాప్ 15 జాబితాలో కూడా సుధీర్‌బాబు నిలిచారు.

కంగనా విషయంలోనే ఎందుకు?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. అంతేకాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కూడా. విభిన్నమైన పాత్రలు చేస్తూ బాలీవుడ్ క్వీన్ గా సినిమాలు చేస్తున్న కంగనా చుట్టూ.. వివాదాలు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. తను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కో స్టార్స్ పై కూడా కామెంట్స్ చేస్తుంది. ఇక ఇటీవలే మణికర్ణిక సినిమా ఏపిసోడ్ అయితే పెద్ద డ్రామాగానే నడిచింది. సినిమా నుండి క్రిష్ డైరెక్టర్ గా తప్పుకోవడం.. కంగనా దర్శకత్వ భాధ్యతలు తీసుకోవడం.. ఆ తరువాత పలువురు నటులు తప్పుకోవడం.. ఇలా పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ నేపథ్యంలో విడుదలైనా మంచి ఘన విజయం సాధించింది. రిలీజ్ తరువాత…

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్వరూప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొన్న ఈసినిమా ఈనెల 21 (జూన్ 21) వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
లక్ష్య సాధనే లక్ష్యంగా బ్రతికిన శతాధిక చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు
జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే అందరూ ఆశించిన లక్ష్యాలను సాధించుకోలేరు. అతి కొద్ది మంది మాత్రమే తమ లక్ష్యాలను ముందుగా ప్రకటించి వాటి సాధనకు నిరంతరాయంగా కృషి చేస్తారు... చివరికి అనుకున్నది సాధిస్తారు. అలాంటి కార్య సాధకులలో దివంగత అగ్రనిర్మాత డాక్టర్ డి.రామానాయుడు ముందు వరుసలో ఉంటారు. అయితే తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో రామానాయుడు సాధించాలనుకున్నది ఏమిటి? సాధించింది ఏమిటి? ఆయన సాధించాలి అని నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఏవైనా మిగిలిపోయాయా? అని ఆలోచిస్తే, ఆయన విజయాలను విశ్లేషిస్తే గొప్ప స్ఫూర్తిదాయకమైన ఫలితాలు, విజయాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతాయి.

7 మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

హిప్పీ తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఇది యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతవరకూ నచ్చుతుందో చూద్దాం..

మహర్షి తరువాత మరో ఛాన్స్ కొట్టేసిన అల్లరి నరేష్..!
చాలా కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో కాస్త వెనుకబడిన అల్లరి నరేష్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మహర్షి లాంటి సినిమాలో శివ అనే ఓ కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మహేష్ స్నేహితుడిగా ఈ సినిమాలో అల్లరి నరేష్ అమాయకత్వంతో కూడిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు మహేష్ బాబు పాత్ర ఎంత హైలెట్ గా నిలిచిందో.. నరేష్ పాత్ర కూడా అంతే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో నరేష్ కు మంచి గుర్తింపు రావడంతో పాటు.. అవకాశాలు కూడా క్యూ కట్టాయి.
'వాల్మీకి' ప్రీ టీజర్ త్వరలో
హరీష్ శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ మూవీ 'జిగర్తాండ' సినిమా రీమేక్ 'వాల్మీకి' లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో వరుణ్ మొదటిసారిగా నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటా.. సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ఎక్కడ జరిగినా.. ఎలా జరిగినా.. ఇలా వాటికి సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా హరీష్ శంకర్ ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ప్రీ టీజర్ ను త్వరలోనే రిలీజ్…
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రిలీజ్ త్వరలో
'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాయికిరణ్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాన్పెప్ట్ తో ఆది హీరోగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట చిత్రయూనిట్.

హిప్పీ మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.