‘ఆర్ ఎక్స్ 100’తో టాలీవుడ్‌కు పరిచయమైన కథానాయిక పాయల్ రాజ్‌పుత్. ఓ వైపు హీరోయిన్‌గా వైవిధ్యమైన పాత్రలున్న చిత్రాల్లో నటిస్తూనే… మరోవైపు ఐటమ్ సాంగ్స్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ‘సీత’ సినిమాలో “బుల్ రెడ్డి” పాటలో నర్తించిన పాయల్… ఇప్పుడు మరో భారీ బడ్జెట్ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో ట్రైలింగ్వల్ మూవీ ‘సాహో’ రూపొందుతున్న విషయం విదితమే. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం… పాటలు మినహా చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అయితే… ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం పాయల్‌ను సంప్రదించిందంట చిత్ర బృందం. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరించనున్నారని టాక్. ఇటీవల ఈ చిత్ర సంగీత దర్శకులు శంకర్, ఎహసాన్, లాయ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో… మరో మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతుకులాటలో ఉందట చిత్ర యూనిట్. వన్స్… మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిన వెంటనే ఈ సాంగ్‌ను రికార్డ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే… ఈ స్పెషల్ సాంగ్‌కి సంబంధించి పాయల్ ఎంట్రీపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా… ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=elwiPtD8-1U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























