‘కోలీవుడ్’ కి ‘నేల టికెట్టు’ భామ

Malavika Sharma to Make Kollywood Debut with Vaibhav Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nela Ticket Movie Actress Next in Kollywood Debut,Malavika Sharma To Make Tamil Film With Vaibhav,Actress Malavika Sharma New Movie Updates,Malavika Sharma Likely To do Tamil Debut
Malavika Sharma to Make Kollywood Debut with Vaibhav Movie

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘నేల టికెట్టు’ గుర్తుండే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న మోడల్ మాళవిక శర్మ నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా మాళవిక శర్మకు మాత్రం యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కింది. అయితే ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ వచ్చిన మాళవికకు ఇటీవలే మెగా హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్టు వార్తలు వచ్చాయి. చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి తేజ్‌, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించనున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ భామ తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి అక్కడ కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. తాజా సమాచారం ప్రకారం… సరోజ ఫేమ్ వైభవ్ హీరోగా తెరకెక్కబోయే ఓ సినిమాకు మాళవిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా ఈ భామకు మంచి సక్సెస్ దక్కుతుందేమో చూద్దాం…

[subscribe]
[youtube_video videoid=4jgbYzYAhXc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =