‘మహానటి’ (2018) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కీర్తి సురేష్ మళ్ళీ తెలుగు చిత్రంలో కనిపించిందే లేదు. అయితే… నేరుగా కాకపోయినా గతేడాది ‘సామి’, ‘పందెంకోడి 2’, ‘సర్కార్’ వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కీర్తి. తెలుగు చిత్రం కోసం ఏడాదికి పైనే గ్యాప్ తీసుకున్న కీర్తి… ప్రస్తుతం నా నువ్వే
, 118
చిత్రాల నిర్మాత మహేష్ కొనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సఖి’ (ప్రచారంలో ఉన్న పేరు)లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే… తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… యువ కథానాయకుడు నితిన్, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనుంది. ‘తొలిప్రేమ’ ‘మిస్టర్ మజ్ను’ తరహాలోనే ఈ సినిమాని కూడా లవ్ స్టోరీతోనే రూపొందించనున్నాడట వెంకీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించనుందని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి… కీర్తి ఎంట్రీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: