‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా. అప్పటి వరకూ ఒకే ధోరణిలో ఉన్న సినిమాలు చూసి విసిపిపోయిన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకోండి. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. సందీప్ వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా అర్జున్ రెడ్డి సినిమా తరువాత సందీప్ వంగా, మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందన్న వార్తలు అప్పట్లో వచ్చిన సంగతి విదితమే. అయితే ఆ తరువాత ఈ సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదనుకోండి అది వేరే స్టోరీ. అయితే ఇప్పుడు సందీప్ వంగా డైరెక్షన్ లో రాబోయే కొత్త సినిమా క్రైమ్ డ్రామాగా ఉండబోతుందట. పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు కబీర్ సింగ్ సినిమా రిలీజ్ అయిపోయిన తరువాత తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సందీప్ వంగా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో మరి..!
[subscribe]
[youtube_video videoid=lG_Zw5fT5Jo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























