‘నర్తనశాల’ సినిమాతో పరాజయంపాలైన కూడా యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక వైపున ఇతర బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లోను నాగశౌర్య సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే సమంతతో ఓ బేబీ సినిమాలో నటించగా.. తాజాగా రాఘవేంద్రరావు కొత్త సినిమా.. ముగ్గురు డైరక్టర్లు, ముగ్గరు హీరోయిన్లతో చేస్తున్న సినిమాలో కూడా నటించనున్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో ఓ సినిమా లైన్ లో వుంది. ఇక తాజా సమాచారం ప్రకారం… తన బ్యానర్ లో నటిస్తున్న సినిమాకు అశ్వద్ధామ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ కూడా చేయించాడట… అందువలన ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు.
కాగా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్నాడు. నాగశౌర్య సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే ఫస్టులుక్ ను వదిలే ఆలోచనలో వున్నారు.
[subscribe]
[youtube_video videoid=5gAchzPci2w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























