చిరు చేతుల మీదగా ‘పహిల్వాన్’ ఫస్ట్ లుక్

ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనితోపాటు సుదీప్ ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాాజాగా ఈ సినిమాలో సుదీప్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అసక్తికరమైన విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఈ ఫస్ట్ లుక్ రిలీజైంది. సుదీప్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ చిరు సోషల్ మీడియాలో పహిల్వాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కిల్లింగ్ లుక్స్ లో రియ‌ల్ పైల్వాన్‌లా సుదీప్ ఉన్నాడ‌ని చిరు అన్నారు. ఇక ఫస్ట్ లుక్ ను చూస్తుంటే సుదీప్ బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని కూడా పిలిపించారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించారు. మరి చూద్దాం ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

[subscribe]
[youtube_video videoid=uk8WLG6SGoY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 1 =