
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 23


జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చరణ్!?
మరో టాలెంటెడ్ డైరెక్టర్‌తో నేచురల్ స్టార్?

అశ్వమేథం టీజర్ రిలీజ్
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెలుగు మూవీ
ముగ్గురు హీరోలతో అర్జున్ రెడ్డి భామ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య

NKR 17 మూవీ ప్రారంభం
అమలాపాల్ నగ్నత్వాన్ని డిమాండ్ చేసిన “ఆమె”

ప్రారంభమైన రాజు గారి గది 3 మూవీ

‘మన్మథుడు 2’తో హ్యాట్రిక్ దక్కుతుందా?

మెగా హీరో తో మరోసారి జంటగా రాశీఖన్నా
సంపూ సినిమాకు విముక్తి రిలీజ్ డేట్ ఫిక్స్
బాలయ్య పాత్రలో ఎలాంటి మార్పులు లేవట
నందిత శ్వేత 'అక్షర' టీజర్ రిలీజ్

చిరంజీవి ‘పునాదిరాళ్ళు’కు 40 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌కు పునాదిగా నిలచిన చిత్రం ‘పునాదిరాళ్ళు’. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ను కాస్త చిరంజీవిగా మార్చి కాలక్రమంలో మెగాస్టార్ స్థాయికి తీసుకెళ్ళడానికి దోహదపడిన సినిమా ఇది. నరసింహరాజు హీరోగా నటించిన ఈ చిత్రంలో... హీరో స్నేహితుల్లో ఒకడిగా ముఖ్య పాత్రను పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు చిరు. కవిత, గోకిన రామారావు, రోజారమణి, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి గూడపాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించాడు. ఎస్.ప్రేమ్‌జీ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలలో “కార్మిక కర్షక”, “ఏ పల్లె ఏ వాడ” వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని చందన్ సిగార్ వర్క్స్ ఎస్.అబ్దుల్…

జూన్ 24 నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్‌లో చరణ్!?
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా... మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఇటీవల ఫ్యామిలీతో హాలిడే ట్రిప్‌కి వెళ్ళొచ్చిన చరణ్... స్వల్ప విరామం తరువాత మళ్ళీ `ఆర్ ఆర్ ఆర్` సెట్‌లోకి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
మరో టాలెంటెడ్ డైరెక్టర్‌తో నేచురల్ స్టార్?
ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో `గ్యాంగ్ లీడర్`, ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్‌లో `వి` చిత్రాలు చేస్తున్న నేచురల్ స్టార్ నాని... మరో టాలెంటెడ్ డైరెక్టర్‌తో జట్టుకట్టనున్నట్లు టాలీవుడ్ టాక్. ఆ దర్శకుడు మరెవరో కాదు... చంద్రశేఖర్ యేలేటి.

అశ్వమేథం టీజర్ రిలీజ్
నితిన్ దర్శకత్వంలో ధృవ కరుణాకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను, ఓ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

హాలీవుడ్ కు శృతిహాసన్ -ఫస్ట్ సౌతిండియన్ హీరోయిన్
ఇన్ని రోజులు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన శృతిహాసన్.. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తరువాత మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ సినిమాల్లో అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో అప్పుడే రవితేజతో నటించే అవకాశం కొట్టేసింది. మొదట రెమ్యునరేషన్ దగ్గర కాస్త మొండికేసిన ఈ భామ ఆ తరువాత దిగొచ్చి.. సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తమిళ్ లో విజయ్ సేతుపతితో కూడా మరో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే జరుపుకొని షూటింగ్ ను ప్రారంభించింది.
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క
నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టిలింగ్వల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెలుగు మూవీ
స్వఛ్చమైన ప్రేమ లోని తీవ్రత, అది విఫలమైనప్పుడు కలిగే బాధ వంటి నేపథ్యం లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా ఒక వినూత్న ప్రేమకథ గా అర్జున్ రెడ్డి మూవీ రూపొందింది. 2017 సంవత్సరంలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. సూపర్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ తమిళ భాషలో రీమేక్ అయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా అర్జున్ రెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీ లో రీమేక్ అయింది.
ముగ్గురు హీరోలతో అర్జున్ రెడ్డి భామ
'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆతరువాత మంచి అవకాశాలతో దూసుకుపోతుంది షాలినిపాండే. షాలిని కూడా మంచి కథలనే ఎంచుకొని కెరీర్ లో దూసుకుపోతుంది. ఆమె నటించిన 'అర్జున్ రెడ్డి', 'మహానటి', '118' ఇలా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మరో డిఫరెంట్ రోల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైనట్టు వార్తలు వస్తున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందించనున్నారు. నాగచైతన్య 20 వ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య వెంకీ మామ మూవీ లో నటిస్తున్నారు.
రాజ్ దూత్ నుండి "మనసున మనసున" లిరికల్ సాంగ్ రిలీజ్
కార్తీక్ - అర్జున్ దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా 'రాజ్ దూత్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అన్ని పనులు త్వరలోనే పూర్తిచేసి జులై 5వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మేఘాంశ్ కు మంచి మార్కులు పడ్డాయి.

NKR 17 మూవీ ప్రారంభం
సూపర్ హిట్ మూవీ 118 తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా NKR 17 మూవీ ఈ రోజు ప్రారంభమయింది. సూపర్ హిట్ మూవీ శతమానం భవతి వంటి కథా చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ NKR 17 ఈరోజు పూజా కార్యక్రమం జరుపుకుంది. ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఈ మూవీ తో నిర్మాణ రంగం లోకి అడుగు పెడుతున్నారు .
అమలాపాల్ నగ్నత్వాన్ని డిమాండ్ చేసిన “ఆమె”
ఇప్పుడు సౌత్ ఇండియాలో అమలాపాల్ నటించిన “ఆమె” చిత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో రత్న కుమార్ దర్శకత్వంలో వి స్టూడియోస్ పతాకంపై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మించిన “ఆడై” చిత్రాన్ని తెలుగులో “ఆమె” పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అమలాపాల్ ఒక సన్నివేశంలో పూర్తి నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. అత్యాచారానికి గురైన అమలాపాల్ సన్నివేశం డిమాండ్ మేరకే అలా నగ్నంగా నటించవలసి వచ్చింది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. దర్శకుడు చెప్పిన సన్నివేశంలోని తీవ్రత, ఇంటెన్సిటీ పట్ల కన్విన్స్ అయినందువల్లనే తాను నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని అమలాపాల్ సమర్థించుకుంటోంది.
'డియర్ కామ్రేడ్' నుండి మూడో లిరికల్ సాంగ్ రిలీజ్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మరో సినిమా 'డియర్ కామ్రేడ్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా హిట్ అవ్వడంతో.. సహజంగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అభిమానులు కూడా ఈసినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈలోపు వారి నిరీక్షణకు కాస్త ఊరటనిచ్చేవిధంగా ఈ సినిమా నుండి అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ కూల్ చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, రెండు లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా ఇప్పుడు మూడో లిరికల్ సాంగ్ ను రిలిజ్ చేసింది.

ప్రారంభమైన రాజు గారి గది 3 మూవీ
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ, హారర్ మూవీ రాజు గారి గది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగార్జున, సమంత నటించిన రాజు గారి గది2 మూవీ కూడా రూపొందింది. ఇప్పుడు రాజు గారి గది 3 మూవీఈ రోజు (20వ తేదీ )లాంఛనంగా ప్రారంభమయింది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న రాజు గారి గది 3 మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. అశ్విన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్ సహాయక పాత్రలలో నటిస్తున్నారు.
యానిమేటెడ్ మూవీకి గాత్రదానం - 'పుంబా'కు బ్రహ్మీ 'టిమోన్'కు అలీ
ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు గాత్ర దానం చేయడం కామన్ అయిపోయింది. ఇటీవల రానా 'అవెంజెర్స్ ఎండ్ గేమ్' సినిమాలో థానోస్ కు గాత్రదానం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లావుద్దీన్ సినిమాకు వెంకీ, వరుణ్ కూడా గాత్రదానం చేశారు. జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా, అల్లావుద్దీన్ కి వరుణ్ గొంతు పలికారు. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ తమ గొంతును అరువివ్వనున్నారు. వారు ఎవరో కాదు కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం, అలీ.

‘మన్మథుడు 2’తో హ్యాట్రిక్ దక్కుతుందా?
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్... ‘అంతఃపురం’(1998) చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ... తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ‘నువ్వు నేను’, ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’(సమర్పణ), ‘ఒకరికి ఒకరు’, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘మజ్ను’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి... నిర్మాణ రంగంలో మంచి అభిరుచి గల సంస్థగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

మెగా హీరో తో మరోసారి జంటగా రాశీఖన్నా
అనిల్ రావిపూడి దర్శకత్వం లో మెగా హీరో సాయి తేజ్, రాశీఖన్నా జంటగా రూపొందిన సుప్రీమ్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాయి తేజ్ హీరోగా రూపొందే మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వం లో సాయి తేజ్, రాశీఖన్నాజంటగా రూపొందే మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. సాయి తేజ్ తో రెండవ సారి రాశీఖన్నా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
సంపూ సినిమాకు విముక్తి రిలీజ్ డేట్ ఫిక్స్
“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా సంపూ అని పిలుచుకుంటూ ఉంటారు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా... తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’ విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.
బాలయ్య పాత్రలో ఎలాంటి మార్పులు లేవట
‘జై సింహా’ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. అలాగే... ఈ చిత్రానికి ‘రూలర్’, ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి కొన్ని మార్పు చేర్పులు చేసినట్టు ఈ మధ్య పలు కథనాలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది.
నందిత శ్వేత 'అక్షర' టీజర్ రిలీజ్
'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ప్రేమ కథా చిత్రమ్', 'అభినేత్రి' 2 లాంటి హార్రర్ సినిమాలో దెయ్యంగా కనిపించి అందరినీ భయపెట్టిన నందిత శ్వేత ఇప్పుడు అక్షర తో మరోసారి భయపెట్టడానికి వచ్చేస్తుంది. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.