కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 24

2019 Latest Telugu Movie News, Shalini Pandey To Play Interesting Role, Shalini Pandey latest movie updates, Shalini Pandey next project details, actress shalini pandey New Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Sha
సినిమా వార్తలు

‘మహానటి’ బ్యానర్‌లో ‘అర్జున్ రెడ్డి’ భామ‌?

ఇటీవల ‘118’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యువ కథానాయిక షాలినీ పాండే... తనకు ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చిన స్వప్న సినిమా బ్యానర్‌లో మరోసారి నటించడానికి సిద్ధమవుతున్నట్టు టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొర‌టాల సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న‌ చిరు?

తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌ యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోందీ సినిమా. ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఇదిలా ఉంటే... ‘సైరా’ తరువాత విజనరీ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు చిరు. అయితే... ‘సైరా’లోని పాత్ర కోసం బాగా బరువు పెరిగిన చిరు... ఇప్పుడు కొరటాల శివతో చేయబోయే మూవీ కోసం సన్నగా, స్మార్ట్ అండ్ స్టైలిష్…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అశ్వమేథం' టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

నితిన్ ద‌ర్శ‌కత్వంలో ధృవ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా అశ్వమేథం. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను, ఓ పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా టీజర్ లాంచ్ కు డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఓ బేబి ట్రైలర్ రిలీజ్

పెళ్లైన తరువాత చాలా సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ సమంత వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఓ బేబి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెలుగులో ఓ బేబి టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Bharathi Raja raising Telugu Tamil Separation Controversy,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bharathi Raja Latest News,Director Bharathi Raja Controversy,Bharathiraja Controversy Comments on Telug
సాంగ్

తెలుగు - తమిళ ఏర్పాటు వాదన్ని రెచ్చగొడుతున్న భారతీ రాజ

If you want to kill a dog name it mad... అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంది. అలాగే నీకు గిట్టనివాళ్ళకు కీడు చేయాలి అంటే వాళ్లకు లేని అపవాదు ఏదో అంట గట్టాలి. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ విషయంలో జరుగుతుంది అదే. తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శిగా తమిళ చిత్ర రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాల్ మీద ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న దుష్ప్రచారం హద్దులు దాటుతుంది. ఈ నెల 23న జరుగనున్న నడిగర్ సంఘం ఎన్నికలలో మరోమారు ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విశాల్ ను , అతని ప్యానల్ ను ఓడించటం కోసం ప్రత్యర్థి వర్గం ఎన్నుకున్న ఆయుధం "తమిలేతరుడు"."తమిళుడు కాని విశాల్…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Akshara Teaser Gets a Release Date,Akshara Telugu Movie Teaser Release Date,Akshara Movie Teaser Released Date Locked,Akshara Teaser Released Date Fixed,Akshara Movie Teaser Released Date Announced,Akshara Movie Latest U
ట్రైలర్ & టీజర్

అక్షర టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో 'అక్షర' అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బి. చిన్నికృష్ణ తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుండి ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి అసురులదర అనే పాటను రిలీజ్ చేయగా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల వస్తున్న పాటలకు కాస్త భిన్నంగా ఉన్న ఈపాట అందరినీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Voter Movie Rights Acquired By Popular Production House,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Voter Movie Theatrical Rights,Voter Movie Rights,Voter Movie Latest Updates,Voter Telugu Movie Latest New
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాణ సంస్థకు 'ఓటర్' మూవీ రైట్స్

జి.ఎస్‌.కార్తిక్‌ దర్శకత్వంలో పొలిటికల్ నేపథ్యంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఓటర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో ప్రారంభించారు చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Ranarangam Team Wishes Kajal Aggarwal On Her Birthday ,2019 Latest Telugu Movie News,Kajal First Look From Ranarangam Movie,Kajal Aggarwal New Look From Ranarangam,First Look of Kajal Aggarwal in Ranarangam,Ranarangam Movie Latest Updates,Telugu Film
ఫస్ట్ లుక్

'రణరంగం' నుండి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఎంతో మంది యంగ్, సీనియర్ హీరోలతో పనిచేసిన ఈ భామ.. ఇండస్రీలోకి అడుగుపెట్టిన 12 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే సీత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అది నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు తాజాగా 'రణరంగం' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Raj Tarun and Sathya Sai Arts Movie Launched,Raj Tarun New Movie Launched Today,Raj Tarun Next Project Details,Raj Tarun Signs A New Project,Raj Tarun Signs Another Crazy Project,Raj Tarun Upcoming Films News,Telugu Film
సినిమా వార్తలు

సత్య సాయి ఆర్ట్స్ కొత్త సినిమా ప్రారంభం

నిర్మాత KK రాధా మోహన్ నిర్మాణ సారథ్యం లో సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఏమైందీ ఈ వేళ, బెంగాల్ టైగర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ రోజు ఒక కొత్త సినిమా పూజ కార్యక్రమం జరుపుకుంది. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారు. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ని సత్య సాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 8 గా వ్యవరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Is Andhra Pradesh Chief Minister YS Jagan A Huge Fan Of Balakrishna?,YS Jagan Die Hard Fan of Balakrishna,AP CM YS Jagan About Balakrishna,YS Jagan Big Fan of Balayya,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema
స్పెషల్

సమరసింహా రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అభినందనలు

కాలం చాలా విచిత్రమైంది. కాలగమనంలో ఊహకందని మలుపులు , ఊహాతీతమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి అనటానికి ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి - నందమూరి నటసింహం బాలకృష్ణల అనుబంధం గురించి చెప్పుకోవచ్చు. సినిమాల పట్ల, సినిమా రంగంపట్ల నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గొప్ప అభిమానం, ఆసక్తి ఉన్నాయి అనటానికి తాజా ఉదాహరణలు ఏమీ లేవు కానీ ఒకప్పుడు ఆయన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని అన్నది మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలియదు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Superstar Mahesh Babu About His Fans,Die Hard Fans of Mahesh Babu,Mahesh Babu Says Thanks to His Fans,Maheshbabu New Movie News,Maheshbabu Upcoming Films,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News
సినిమా వార్తలు

నా సక్సెస్ ఫుల్ సినీ జర్నీ కి అభిమానులే కారణం

సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి సక్సెస్ ను మహేష్ బాబు తన ఫ్యామిలీ తో జర్మనీ లో ఎంజాయ్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించే 26 వ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటారు. సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. టాలీవుడ్ లో తన సక్సెస్ ఫుల్ జర్నీ గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ తో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Balakrishna and Shriya Saran To Work Together Again,Shriya to Team Up With Balakrishna,Shriya Saran to Pair Up Again With Nandamuri Balakrishna,Balakrishna and Shriya Combo is Back,Balakrishna and Shriya Combination To R
సినిమా వార్తలు

మ‌రోసారి బాలయ్యకి జోడీగా శ్రియ?

నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన కథానాయికలలో శ్రియ ఒకరు. ఈ ఇద్దరి కలయికలో ‘చెన్నకేశవరెడ్డి’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’, `య‌న్టీఆర్ క‌థానాయ‌కుడు` (శ్రియ అతిథి పాత్ర‌) చిత్రాలు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ ఇద్ద‌రు మరోసారి జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,50 Years For Sattekalapu Satteya Movie,Sattekalapu Satteya Movie completes 50 years,shoban Babu Sattekalapu Satteya Movie completed 50 years,Sattekalapu Satteya Movie Turns 50 Years,Sattekalapu Satteya Movie Latest News,
సినిమా వార్తలు

‘సత్తెకాలపు సత్తెయ్య’కు 50 ఏళ్ళు

తెర వెనక చలం, శోభన్ బాబు ఎంత మంచి స్నేహితులో... తెరపై కూడా ఈ ఇద్దరి కాంబినేషన్ అంతటి విజయవంతమైనది. ఈ ఇద్దరి కలయికలో వ‌చ్చిన ప‌లు సినిమాలు విజయవంతం కాగా... వాటిలో ‘సత్తెకాలపు సత్తెయ్య’ ఒకటి. దర్శ‌క‌దిగ్గ‌జం కె.బాలచందర్ రూపొందించిన‌ ఈ చిత్రంలో చలం, శోభన్ బాబు ప్రధాన పాత్రల్లో న‌టించ‌గా... రాజశ్రీ, విజయలలిత, బేబి రోజారమణి, గుమ్మడి, వరలక్ష్మి, సత్యనారాయణ త‌దిత‌రులు ముఖ్య భూమికలను పోషించారు. ఎం.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పనలో రూపొందిన బాణీలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలో “నన్ను ఎవరో తాకిరి”, “ముద్దు ముద్దు నవ్వు” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,North Indians Thank Superstar Mahesh Babu,North Indians Special Thanks To Super Star,Director Sandeep Vanga About Mahesh Babu New Movie,Director Sandeep Gives Clarity On Mahesh Babu Movie,Telugu Film Updates,Telugu Filmn
సినిమా వార్తలు

ఆ క్రెడిట్ మహేష్ కే - థ్యాంక్స్ చెబుతున్న నార్త్ ఆడియన్స్

నార్త్ ఆడియన్స్ మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కు థ్యాంక్స్ చెబుతున్నారు. దానికీ కారణం ఏంటంటారా..? కబీర్ సింగ్. కబీర్ సింగ్ రీమేక్ చేయడానికి.. నార్త్ ఇండియన్ ఆడియన్స్ మహేష్ కు థ్యాంక్స్ చెప్పడానికి లింక్ ఏముందనుకుంటున్నారా..? అసలు మ్యాటరేంటో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News,Mega Hero To Work With Prasthanam Movie Director,Sai Dharam Tej New Movie Updates,Sai Dharam Tej Next Film With Director Deva Katta,Sai Dharam Tej To Team Up With Director Deva Katt,Telugu Film Updates,Telugu Filmnagar,T
సినిమా వార్తలు

‘ప్ర‌స్థానం’ ద‌ర్శ‌కుడితో మెగా హీరో?

ఈ వేస‌వికి విడుద‌లైన‌ ‘చిత్రలహరి’తో మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్న‌ మెగాహీరో సాయి తేజ్... మారుతి దర్శకత్వంలో ‘ప్రతీ రోజు పండగే’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) చిత్రం చేయ‌బోతున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కనున్న ఈ సినిమా... ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉంటే... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌ ఈ మెగాహీరో.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Mahesh Babu To Sport A New Look Again,Mahesh Babu Upcoming Film Look,Mahesh Babu New Look From Sarileru Neekevvaru Movie,Sarileru Neekevvaru Movie Latest Updates,Mahesh Babu Shades in Sarileru Neekevvaru Movie,Telugu Fil
సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు’ కోసం మ‌హేష్ స‌రికొత్త లుక్‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా రానున్న‌ సంగతి తెలిసిందే. మహేష్‌ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, జ‌గ‌ప‌తిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా... జూలై 5 నుంచి జమ్ము, కాశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ను జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో భాగంగా... మహేష్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించ‌నున్నారని తెలిసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Shraddha Kapoor Wants To Do More Telugu Movies, Shraddha Kapoor Intrested to Make More Telugu Film,Shraddha Kapoor planning to do Next Film in Telugu,Shraddha Kapoor Upcoming Movie Updates,Telugu Film Updates,Telugu Film
సినిమా వార్తలు

టాలీవుడ్ పై స్పెషల్ టార్గెట్

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రద్ధా కపూర్, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందున్న సాహో మూవీ ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. వరల్డ్ ఫేమస్ నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో మూవీ బిగ్ ప్రాజెక్ట్ అని శ్రద్ధాకపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాహో మూవీ ద్వారా దేశవ్యాప్తం గా ఫేమస్ అవుతానని ఆమె ఊహించలేదు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News,Raj Tarun and Aditi Rao Hydari To Pair Up For A New Movie,Aditi Rao Hydari to pair opposite Raj Tarun in upcoming film,Aditi Rao Hydari Roped For Raj Tarun,Aditi Rao Hydari upcoming Movies,Telugu Film Updates,TeluguFilmn
సినిమా వార్తలు

అదితిరావ్‌తో రాజ్ త‌రుణ్ ప్రేమ‌క‌థ‌?

గత ఏడాది ‘సమ్మోహనం’, ‘అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్.’ చిత్రాలలో క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది అదితిరావ్ హైదరి. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నాయిక‌గా నటిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ. అంతేకాదు... మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా అదితి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actress Kajal Aggarwal Birthday Special News, Actress Kajal Aggarwal Birthday Special Poll, Best Films of Kajal Aggarwal, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Top 10 Movies of Kajal Aggarwal, Wi
బర్త్‌డే స్పెషల్స్

పన్నెండేళ్ల పయనంలో కాజల్ ఖాతాలో 12 సూపర్ హిట్స్

హీరోయిన్ల కెరీర్ స్పాన్ రానురానూ తగ్గిపోతోంది. రెండు మూడేళ్ల కెరీర్లో ఐదారు సినిమాలు చేసి ఇంటి ముఖం పడుతున్నారు చాలా మంది హీరోయిన్లు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తాపత్రయంతో ఒకటి రెండు హిట్లు రాగానే రేట్లు పెంచి, అన్ని సినిమాలు ఒప్పుకుని చివరకు డేట్లు ఎడ్జెస్ట్ చేయలేక నిర్మాతలను ఇబ్బందులపాలు చేసి చివరకు ఒకటి రెండు ప్లాపులు రాగానే కనుమరుగై పోతుంటారు చాలామంది హీరోయిన్లు. కానీ కొద్ది మంది హీరోయిన్లు మాత్రం ఒక లాంగ్ విజన్ తో లాంగ్ ఇన్నింగ్స్ ఆడే లక్ష్యంతో కెరీర్ ను జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటారు.

Team TFNవాట్సాప్
First Rank Raju Movie Censor Report,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,First Rank Raju Movie Censor Talk,First Rank Raju Movie Completes Censor Formalities,First Rank Raju Movie Latest Updates,Fir
సినిమా వార్తలు

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ ర్యాంక్ రాజు

కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాతృక డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రీలిజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.

TFN Adminవాట్సాప్

షేర్