ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ, హారర్ మూవీ రాజు గారి గది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగార్జున, సమంత నటించిన రాజు గారి గది2 మూవీ కూడా రూపొందింది. ఇప్పుడు రాజు గారి గది 3 మూవీఈ రోజు (20వ తేదీ )లాంఛనంగా ప్రారంభమయింది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో రూపొందనున్న రాజు గారి గది 3 మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర లో నటిస్తున్నారు. అశ్విన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హరితేజ, అజయ్ ఘోష్ సహాయక పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజు గారి గది 3 హారర్ థ్రిల్లర్ మూవీ ప్రారంభోత్సవానికి మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్త సన్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ స్విచ్చాన్ చేశారు. రేపటి నుండి(21 వ తేదీ ) హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీ కి ఛోటా K నాయుడు (సినిమాటోగ్రఫీ ), సాయి మాధవ్ బుర్రా (డైలాగ్స్ ), గౌతమ్ రాజు (ఎడిటింగ్ ), సాహి సురేష్ (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ) గా పనిచేస్తున్నారు.
[youtube_video videoid=rtvFHmNWo3I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: