ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రముఖ రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్‌లో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. శంబాల హిట్ అవ్వడంతో అందరూ నాకు ఫోన్ చేసి ‘మీ ఫ్రెండ్ హిట్టు కొట్టాడు’ కంగ్రాట్స్ అని మెసెజ్ చేస్తున్నారు. నిజాయితీగా సినిమా తీస్తే, మంచి వ్యక్తి కష్టపడి సినిమా చేస్తే హిట్ ఇస్తారని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు. ఓ మూవీ సక్సెస్ అయితే అది కేవలం టీంకే చెందదు. ఆ విజయం ఇండస్ట్రీలో ఎంతో మందిలో స్పూర్తిని నింపుతుంది. నిర్మాతలైన రాజశేఖర్ గారు, మహీధర్ గారికి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. దర్శకుడు యుగంధర్ ముని చాలా అద్భుతంగా ఈ మూవీని తీశారు. రాజేష్ దండా ఈ మూవీని ముందే చూసి హిట్ అని చెప్పేశారు. ఆదికి సాయి కుమార్ సంపాదించి పెట్టినంత మంచితనం ఇంకెవ్వరూ సంపాదించి ఇవ్వలేరు. ఆదికి హిట్టు వస్తే.. నాకు వచ్చినట్టే. నేను నిర్మాతగా ఆదితో ఓ మూవీని తీస్తున్నాను. నా ప్రొడక్షన్‌లో అదే బెస్ట్ మూవీగా నిలుస్తుంది అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























