మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నాన్నగారు మెగాస్టార్ చిరంజీవి గారికి, అనిల్ రావిపూడి గారికి, సాహు గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసుకు చాలా తృప్తిని ఇస్తాయి. పెద్ది విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసింది. పెద్ది లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా మీ అందరికీ థాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు ‘మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో అది ఈ సినిమా ద్వారా తెలిసింది. అది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం. చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు కూడా లుంగీలు కట్టుకుని, తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. మళ్లీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో తెలియదు. ఈ సినిమాను మీరు ఎంతగా ఆదరించారంటే, రామ్ చరణ్‌ను మర్చిపోయి పెద్దినే గుర్తుపెట్టుకుంటారేమో అనిపిస్తోంది. ఆ విషయాన్ని మా ఇంట్లోనే నేను అనుభవించాను. పెద్ది రిలీజ్ అయ్యే వరకు మా పాప క్లీంకార నన్ను ‘నాన్న’ అని పిలిచేది. సినిమా విడుదలైన తర్వాత ‘పెద్ది’ అని పిలుస్తోంది. ఇప్పుడు అందరికీ పెద్దినే గుర్తుంది. ఇంత అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చిన బుచ్చిబాబుకు చాలా థాంక్స్. సుకుమార్ గారు నా ఫేవరెట్ పర్సన్. నా జీవితంలో ఎప్పుడైనా చిన్న డౌన్ మూమెంట్ వచ్చినా, నాన్నగారి తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారే. ఆయన లెక్చరర్‌గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. నన్ను కూడా ఒక స్టూడెంట్‌లా చూసి గైడ్ చేయాలని నేను ఎప్పుడూ అడుగుతుంటాను. సతీష్ గారు పెద్ది సినిమాకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడ్డారు. తొలి సినిమాకే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిలిచిన ఆయనకు థాంక్యూ సో మచ్. భవిష్యత్తులో కూడా ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. రత్నవేలు గారు ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆయన సినిమాటోగ్రఫీ నిజంగా మాస్టర్‌పీస్. రెహమాన్ గారు తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అలాగే మా టీమ్‌లోని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అన్ని విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తోంది. ‘తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా ఎవరినీ ఇష్టపడరు. ఒకసారి ఇష్టపడితే చనిపోయే వరకు ప్రేమిస్తూనే ఉంటారు.’ అదే ప్రేమను మీరు పెద్దిపై చూపించారు.
ప్రేక్షకులు ఈ సినిమాను తమ సినిమాగా భావించి తమ భుజాలపై మోసుకుని ఘన విజయాన్ని ఇచ్చారు. ఈ సినిమాలోని మంచిని గుర్తించి ఆదరించిన ప్రతి ప్రేక్షక దేవుడికి నా సెల్యూట్. ఈ సినిమాకు రివ్యూలు ఇచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పెద్దికి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇంత మర్చిపోలేని సినిమాను, ఇంత గొప్ప జ్ఞాపకాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. జాన్వీ కపూర్‌కు, అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాట చేసిన శృతి హాసన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























