హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది – సాయి దుర్గా తేజ్ 

Sai Durgha Tej Impressed by the 3D Version of HanuMan

సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని జూన్ 25న 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్  మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మా నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు, చైతన్య రెడ్డి గారు చాలా ప్యాషనేట్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా చూపించాలని భావించి హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు హనుమాన్ 3D రూపంలో వస్తోంది. దయచేసి మీరందరూ జూన్ 25న థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది. అందరూ కలిసి జూన్ 25న థియేటర్లకు రండి. ఈ సినిమాకు పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు, తేజ , అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చు. టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.