బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ ప్రతిష్టాత్మక చిత్రం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. తాజాగా హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్‌పై కొన్ని కీలకమైన సన్నివేశాలను ఎంతో గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు తన వింటేజ్ గ్రేస్, ఎనర్జీతో ప్రతి షాట్‌ను ఒక అద్భుతంగా, ప్రతి సీన్‌ను ఒక సెలబ్రేషన్‌లా మారుస్తున్నారు” అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో చిరు లుక్స్ మరియు క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్‌కు పాత వింటేజ్ బాస్‌ను గుర్తుచేసేలా ఉంటాయని ఇన్సైడ్ టాక్.
భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సరికొత్త రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్‌లోనే మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కొన్ని కీలక పాత్రల కాంబినేషన్ సీన్స్ కూడా కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది.తమన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























