పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి

Chiranjeevi to Attend the Peddi Mega Blockbuster Event as Chief Guest

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం రెండు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయానంతరం, చిత్ర యూనిట్ ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుండి అత్యంత గ్రాండ్‌గా ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ నిర్వహిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.దాంతో ఈవెంట్ లో ఆయన ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది. చిరుతో పాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ ఈవెంట్ కి రానున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో రామ్ చరణ్, కన్నడ సెన్సేషన్ శివరాజ్ కుమార్, అందాల నటి జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్, విలక్షణ నటులు జగపతి బాబు తదితరులు సందడి చేయనున్నారు.

బుచ్చి బాబు సానా తెరకెక్కించిన ఈసినిమాలో రామ్ చరణ్ నటన , ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం హైలైట్ అయ్యాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.నిర్మాతగా ఆయనకు ఇదే తొలి సినిమా.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.