శంబాలను  చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను – అల్లు అరవింద్ 

allu aravind says he thoroughly enjoyed shambhala

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుకడివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రముఖ రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్‌లో..అల్లు అరవింద్ మాట్లాడుతూ ..శంబాల సినిమాని యుగంధర్ ముని అద్భుతంగా తెరకెక్కించారు. సాయి కుమార్‌తో మాది మూడు తరాల అనుబంధం ఉంది.శంబాల ట్రైలర్ చూసిన వెంటనే ఆదికి బన్నీ మెసెజ్ పెట్టాడు. కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే ఆనందం నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. నా కుటుంబంలోని వ్యక్తి సక్సెస్ అయినప్పుడు నేను రావాలని ఇక్కడకు వచ్చాను.కొంచెం ఆలస్యంగా అయినా కూడా ఆది అద్భుతంగా నటించి విజయాన్ని అందుకున్నాడు. ఇక నుంచి ఆది హైవే ఎక్కినట్టుగా దూసుకుపోవాలి.బ్రహ్మాండమైన పాత్రలు ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అర్చనా ఐయ్యర్ డివైన్ పాత్రను అద్భుతంగా పోషించారు. బేబీ చైత్ర అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించింది.ఇలాంటి కథను, దర్శకుడిని నమ్మి చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు కంగ్రాట్స్. ఆది సక్సెస్ అయితే.. ఎదిగితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను.శంబాల మూవీని చూసి నేను చాలా ఎంజాయ్ చేశాను అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.