మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా అభిమానుల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణలో ఎలాంటి మార్పు లేదు. అదే ఉత్సాహం, అదే ప్రేమతో ఆదరిస్తూ వస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక అభివాదాలు. నేను ఇక్కడికి ఒక అతిథిగా, ఒక సీనియర్ నటుడిగా, సినిమాపై అపారమైన ప్రేమ ఉన్న వ్యక్తిగా వచ్చాను. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ప్రేక్షకుడికి, అభిమానికి, చిత్ర బృందానికి నా ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను. ఇలాంటి సినిమాలు రావాలి. పరిశ్రమ సుభిక్షంగా ఉండాలి. థియేటర్లు కళకళలాడాలి. ఆ దిశగా పెద్ది ఒక గొప్ప విజయంగా నిలిచింది. ఈ సినిమా చూస్తున్నంతసేపూ నేను ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది. పాత్రలతో మమేకమై వారి పోరాటంలో నేనూ ఒకడినై ప్రయాణించాను. ఇంత పవర్‌ఫుల్, ఎమోషనల్, మోటివేషనల్ కథను ఎంచుకుని, దానికి రామ్ చరణ్ న్యాయం చేస్తాడని నమ్మి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబుకు సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు. ఇది మట్టి మనుషుల కథ. బుచ్చిబాబు కూడా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ భావోద్వేగాలను అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. ఈ కథకు ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఇలాంటి దర్శకుడిని తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సుకుమార్ గారికి కూడా నా అభినందనలు. మట్టిలో దాగి ఉన్న మాణిక్యాలను వెలికి తీయగల దార్శనికుడు సుకుమార్ గారు. నిర్మాత సతీష్ కిలారు గారు దర్శకుడి విజన్‌ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారు. ఆయనకు నా ప్రత్యేక అభినందనలు. ఒక తోటి నటుడిగా, పరిశ్రమలో సీనియర్ యాక్టర్ గా చెప్పాలంటే… యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, ఇన్వాల్వ్‌మెంట్… ఒక నటుడికి అవసరమైన అన్ని కోణాల్లో పరిపక్వత సాధించి, దానిని 100 శాతం తెరపై చూపించిన రామ్ చరణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలంలో చరణ్ ఎంత అద్భుతంగా నటించాడో చూశాం. అలాంటి పాత్ర మళ్లీ రావాలంటే చాలా కాలం పడుతుందని అనుకున్నాం. మగధీర, రంగస్థలం, అర్అర్అర్ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. కానీ మూడేళ్ల వ్యవధిలోనే పెద్దిలాంటి మరో గొప్ప పాత్ర రావడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ పాత్ర దక్కడం నిజంగా చరణ్ అదృష్టం.సినిమా చూస్తున్నప్పుడు మాకు చరణ్ కనిపించలేదు… పెద్ది మాత్రమే కనిపించాడు. ఆ పాత్రను పూర్తిగా ఒంటబట్టించుకున్నాడు. దర్శకుడికి ఏం కావాలో దానిని అంకితభావంతో ఇచ్చాడు. పెద్ది పాత్రతో మనందరినీ నవ్వించాడు, ఏడిపించాడు, ఉత్సాహపరిచాడు, భావోద్వేగానికి గురిచేశాడు. చివరిగా విజయం సాధించాడు. ఆ పాత్రలో అతను చూపించిన నటనకు నా హృదయపూర్వక అభినందనలు.కళ్లతోనే భావాలను పలికిస్తూ ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగాడు. అదే పరిపూర్ణ నటన. ఈరోజు రామ్ చరణ్ ఆ పరిపక్వతను, ఆ సంపూర్ణతను చూపించి నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాడు. చరణ్ ఒక స్టార్ హీరో కొడుకు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. దర్శకుడు చెప్పింది చేసి వెళ్లిపోవచ్చు. కానీ అతను కష్టాన్ని నమ్ముకున్నాడు. అందుకే ఈరోజు మీరంతా అతని నటనను నేషనల్ అవార్డు స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. అవార్డు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రజల మనసుల్లో ‘అద్భుతంగా నటించాడు’ అనే గుర్తింపు రావడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదు. ప్రజల ప్రేమ, అభిమానం, ఆదరణే గొప్ప అవార్డు. ఈ సినిమా కోసం అతను చేసిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను నేను ప్రతిరోజూ ఇంట్లో చూశాను. ఉదయం వ్యాయామాలు, షూటింగ్, మళ్లీ సాయంత్రం వ్యాయామాలు… అతని కష్టాన్ని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా అనిపించేది. షూటింగ్ సమయంలో చరణ్ కంటికి గాయం అయింది. ఆ ఫొటో చూసి నేను చాలా భయపడ్డాను.
డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ప్రమాదం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. ఎనిమిది కుట్లు పడ్డాయి. అయినా వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలో నాకు గూండా సినిమా షూటింగ్ గుర్తొచ్చింది. ట్రైన్ కింద యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు చాలా భయపడ్డారు. అప్పుడు నేను ‘ప్రేక్షకులను అలరించాలంటే ఇలాంటి రిస్కులు చేయాల్సిందే’ అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు – ‘నీకు కొడుకు పుట్టి, వాడు హీరో అయి ఇలాంటి కష్టాలు పడితే అప్పుడు ఒక తండ్రి బాధ తెలుస్తుంది’ అని. చరణ్ కి గాయమైనప్పుడు నాన్నగారి మాట గుర్తుకు వచ్చింది. అయితే తను కష్టాన్ని నమ్ముకోవడం తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిసి చరణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు.అక్కడ తనకి న్యూ ఏజ్ మెగాస్టార్ అనే టైటిల్ ఇచ్చారు. నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. పిల్లలు ఎదుగుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందం వర్ణించలేనిది. నేను ఈరోజు ఆ పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం అనుభవిస్తున్నాను. మేము ఎప్పుడూ కష్టాన్ని నమ్ముకున్నాం. ఆ కష్టానికి ప్రతిఫలంగా మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. అంత గొప్ప స్థానం ఇచ్చిన ప్రేక్షకలోకానికి, అభిమానులకు, పెద్ది చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జగపతిబాబు గారు, శివరాజ్ కుమార్ గారు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. జాన్వీ కపూర్ కూడా ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి నటీనటుడికి, ప్రతి టెక్నీషియన్‌కు నా అభినందనలు. రెహమాన్ గారి సంగీతానికి ప్రత్యేకంగా అగ్రతాంబూలం ఇవ్వాలి. రత్నవేలు గారు పెద్ది ప్రపంచాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. విజువల్ వండర్‌ను సృష్టించారు. ప్రతి టెక్నీషియన్‌కు నా అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























