రివ్యూ : దృశ్యం 3

drishyam 3 telugu reivew

నటీనటులు : మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపీ, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్
సంగీతం : అనిల్ జాన్సన్
సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్
ఎడిటింగ్ : వినాయక్ విఎస్
దర్శకత్వం : జీతూ జోసెఫ్
నిర్మాత : ఆంటోని పెరుంబవూర్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ సిరీస్ నుండి మోస్ట్ అవేటెడ్ త్రీక్వెల్ ‘దృశ్యం 3’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను సస్పెన్స్ లో ముంచెత్తి ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ను ఇచ్చిందో లేదో రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

‘దృశ్యం 3’ కథ విషయానికి వస్తే.. ఆరేళ్ల క్రితం నాటి వరుణ్ కేసు ముగిసిపోవడంతో జార్జ్ కుట్టి (మోహన్‌లాల్) తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవితాన్ని గడుపుతుంటాడు, పైగా తన జీవితానుభూతుల ఆధారంగా తీసిన సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ క్రమంలోనే తన పెద్ద కూతురు అంజు (అన్సిబా హాసన్)కు పెళ్లి చేయాలనుకోగా, వారి గతం గురించి ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ కుదిరిన ప్రతి సంబంధాన్ని చెడగొడుతుంటారు. ఆ అవసరం ఎవరికి వచ్చిందనే వేదన ఒకవైపు వేధిస్తుండగానే.. తన కుటుంబాన్ని ఎవరో నిరంతరం ఫాలో అవుతున్నారని, అర్థరాత్రి పూట తోటలోకి ఎవరో వచ్చి వెళ్తున్నారని జార్జ్ కుట్టికి అనుమానాలు మొదలవుతాయి. వీటన్నింటికీ మించి ఎప్పుడో ముగిసిపోయిందనుకున్న కేసును బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరో మళ్లీ తిరగతోడుతున్నట్లు గ్రహించిన జార్జ్ కుట్టి, ఆరేళ్ల క్రితం నాటి తన రహస్యాలను తవ్వుతున్న ఆ శత్రువుల నుండి ఈసారి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

విశ్లేషణ :

దృశ్యం , దృశ్యం 2 బ్లాక్ బస్టర్స్ కావడంతో మూడో భాగంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ అంచనాలకు తగ్గట్టే, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీని మూడో భాగం వరకు ఒకే మూడ్‌తో నడిపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్‌లో .. జార్జ్‌కుట్టి ఫ్యామిలీ చుట్టూ జరిగే డ్రామా, కూతురి పెళ్లి సంబంధాలు చెడిపోవడం, వారి వెనుక ఎవరో పొంచి ఉన్నారనే భయం వంటి అంశాలతో కథను చాలా కూల్‌గా, నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు.

ఇక సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా అసలైన వేగాన్ని పుంజుకుంటుంది. ఎప్పుడైతే పాత కేసు మళ్లీ రీ-ఓపెన్ అవుతుందో, అప్పటి నుండి జార్జ్‌కుట్టికి, పోలీసులకు మధ్య జరిగే మైండ్ గేమ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేసే ప్లాన్స్, ఎత్తుకు పైఎత్తులు ఆకట్టుకుంటాయి. అయితే, మొదటి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి ట్విస్ట్‌లలో ఉండే ‘షాక్ వాల్యూ’ కొద్దిగా తగ్గినట్లు అనిపించినా, కథను ముగించిన విధానం మరియు స్క్రీన్‌ప్లే లోని ఇంటెన్సిటీ సినిమాను సేఫ్ జోన్‌లోకి నెట్టేసాయి. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఉత్కంఠను రేకెత్తించి సినిమాను కాపాడింది.

నటీనటులు పెరఫార్మెన్స్ :

జార్జ్ కుట్టి పాత్రలో మోహన్‌లాల్ మరోసారి పరకాయ ప్రవేశం చేశారు. తన మార్క్ సటిల్ బాడీ లాంగ్వేజ్, క్లిష్టమైన పరిస్థితుల్లో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌తో సినిమాను తన భుజాలపై నడిపించారు. ఒక సాధారణ తండ్రి తన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తాడనే ఎమోషన్‌ను ఆయన అద్భుతంగా పండించారు.జార్జ్ కుట్టి భార్య రాణిగా మీనా తన పాత్రలో ఎంతో హోమ్లీగా ఒదిగిపోయారు. కూతుళ్లుగా నటించిన అన్సిబా హాసన్ (అంజు), ఎస్తేర్ అనిల్ (చిన్న కూతురు) తమ నటనతో ఆకట్టుకున్నారు.

సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపి మరియు బిజూ మీనన్ జార్జ్ కుట్టికి పోటీగా నిలిచే పవర్‌ఫుల్ పాత్రల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వీరి మధ్య సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

సాంకేతిక విభాగం :

సస్పెన్స్ థ్రిల్లర్స్ తెరకెక్కించడంలో జీతూ జోసెఫ్ మరోసారి మార్కులు కొట్టేశారు. కథను నడిపించిన విధానం బాగుంది.
అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా, ప్రతి సస్పెన్స్ సీన్‌ను ఎలివేట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. సతీష్ కురుప్ విజువల్స్ కేరళ అందాలను చూపిస్తూనే, కథలోని ఇంటెన్సిటీని చాలా బాగా క్యాప్చర్ చేశాయి.ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు.

ముగింపు:

ఓవరాల్ గా ‘దృశ్యం 3’ గత రెండు భాగాలతో పోలిస్తే అంతగా థ్రిల్ చేయకపోయినా పర్వాలేదనిపించుకుంది.థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మరియు మోహన్‌లాల్ అభిమానులకు ఈసినిమా నచ్చుతుంది. జార్జ్ కుట్టి మైండ్ గేమ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు చక్కటి సాంకేతిక విలువల కోసం ఈ వీకెండ్‌లో థియేటర్లలో చూడాల్సిన క్లాసిక్ థ్రిల్లర్ ఇది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.