టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా అటు మూవీ లవర్స్‌కు ఒక క్రేజీ సర్ప్రైజ్ అప్‌డేట్ లభించింది. మ్యాడ్, ఆయ్ ,మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో వరుసగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు అందుకొని జోరుమీదున్న ఈ యంగ్ హీరో, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేశారు. నార్నే నితిన్ కెరీర్‌లో 5వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సరికొత్త లవ్ స్టోరీ ప్రాజెక్ట్‌ను (#NN5) మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి జూనియర్ ఫేమ్ రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, లీడింగ్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరి గుండెకు హత్తుకునేలా, మనల్ని మళ్లీ ప్రేమలో పడేసేలా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదలచేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు తరహాలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌ను అందిస్తోంది. నీలాకాశం నేపథ్యంగా ఓ భవనం అంచున టీ-షర్ట్, జీన్స్, స్నీకర్స్‌లో కూల్‌గా కూర్చున్న నార్నే నితిన్ కనిపిస్తుండగా, ఎరుపు రంగు డ్రెస్‌లో ఉన్న ఓ యువతి పోస్టులోని హార్ట్ ఐకాన్‌ను ట్యాప్ చేయబోతున్నట్లు చూపించారు.
“ఆకాశంలో ఉంటుంది మూన్… నువ్వే నా లైఫ్‌కి క్వీన్…” అనే ఫన్నీ లైన్‌తో పాటు వేలాది లైక్స్, కామెంట్స్, ట్రెండీ హ్యాష్‌ట్యాగ్స్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా నార్నే నితిన్ బావ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పోస్టును లైక్ చేసినట్లు చూపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. పోస్టర్ ద్వారా చిత్రంలోని రొమాన్స్, వినోదం మాత్రమే కాకుండా మేకర్స్ క్రియేటివ్ ఆలోచన కూడా స్పష్టమవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























