ఎస్.ఎస్. థమన్ మరోసారి తన పెద్ద మనసును చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. మహేశ్‌బాబుకు వీరాభిమాని అయిన రాజేశ్ గతేడాది మరణించగా, ఆయనకు ఉన్న ఇద్దరు పిల్లలు (శివరామ్, సారికశ్రీ) కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నిర్మాత ఎస్‌కేయన్ గతంలోనే స్పందించి ఆర్థిక సహాయం చేయగా, అప్పట్లో థమన్ కూడా ఆ చిన్నారుల చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవల ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆ హామీని గుర్తు చేస్తూ, స్కూల్ ప్రారంభమైందని కోరడంతో థమన్ వెంటనే స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆ చిన్నారుల స్కూల్ ఫీజును చెల్లించి, దానికి సంబంధించిన రశీదులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “స్కూల్ ఫీజు కట్టేశాను. పాఠశాల విద్య పూర్తయ్యే వరకు వారి బాధ్యత నాదే” అని ఆయన భరోసా ఇచ్చారు. తమన్‌కు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























