రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈరోజే విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నయనతార ఈ సినిమాలో ‘గంగ’ అనే పవర్ ఫుల్ పాత్రలో మరియు స్టైలిష్ గా కనిపించబోతున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె ఒక చేతిలో గన్ తో, బ్లాక్ వన్-షోల్డర్ అవుట్‌ఫిట్ మరియు హై బూట్స్‌లో చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత నయన్ ఇలాంటి అల్ట్రా మోడరన్ మరియు గ్లామరస్ యాక్షన్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ మరియు యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పీరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాను 2026 మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన కియారా అద్వానీ మరియు హ్యూమా ఖురేషి లుక్స్‌కు అద్భుతమైన స్పందన రాగా, తాజా నయనతార లుక్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























