మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ముందుగా చిరంజీవి గారికి థాంక్యూ. ఆయన పక్కన కూర్చోవాలన్నా ఇప్పటికీ నాకు టెన్షన్‌గానే ఉంటుంది. చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాకు నిద్ర పట్టేది కాదు. ఆయన మరో సినిమా చేసి హిట్ కొట్టే వరకు ఎదురుచూసేవాళ్లం. అలాంటి చిరంజీవి గారు మాకు రామ్ చరణ్ లాంటి హీరోను ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్.బుచ్చిబాబు ఈ కథ చెబుతున్నప్పుడు నేను, చరణ్ ఇద్దరం అమేజ్ అయిపోయాం. కథ విన్న వెంటనే చాలా ముచ్చట పడ్డాం. చరణ్‌కు కమర్షియల్ సినిమా చేయడం చాలా ఈజీ.కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న కథను, పరిస్థితులే విలన్స్‌గా మారే కథను నమ్మి ఒప్పుకుని చేయడం చాలా గొప్ప విషయం.అలాంటి సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించడం ఇంకా గొప్ప విషయం. కమర్షియల్ సినిమా కాన్సెప్ట్‌ను పెద్ది మార్చేసింది. ఈ విషయంలో బుచ్చిబాబుకి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి.
ఉప్పెన తీసిన అబ్బాయి, పెద్ది లాంటి భారీ చిత్రాన్ని ఇంత అద్భుతంగా హ్యాండిల్ చేయడం నిజంగా గొప్ప విషయం. కంగ్రాట్యులేషన్స్ బుచ్చిబాబు. చరణ్ ఈ సినిమా కోసం కసితో పనిచేశాడు. ప్రతి సీన్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ విజయం చరణ్ కష్టానికి దక్కిన ఫలితం. మా చరణ్ బంగారం. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆ విషయం తెలుసు. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత సతీష్ గారికి కూడా ధన్యవాదాలు. చరణ్ ఇచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. RC 17 ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























