నన్ను అలా  పిలిస్తేనే  నాకు ఇంకా ఎక్కువ గర్వంగా ఉంటుంది – బుచ్చిబాబు సానా

Buchi Babu Sana’s Speech at the Peddi Mega Blockbuster Event

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది  అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా  మేకర్స్ పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, టీమ్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చేతుల మీదుగా షీల్డ్స్ బహుకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “నేను పిఠాపురంలో ఉన్న రోజుల్లో చిరంజీవి గారికి లెటర్లు రాసేవాడిని. అయితే ఆయన నుంచి ఎప్పుడూ జవాబు రాలేదు. కానీ నా మొదటి కథ చెప్పే అవకాశం మాత్రం ఆయనకే వచ్చింది. నా రెండో సినిమా పెద్ది కూడా ఆయన ఇంటికే వెళ్ళింది. ఒక మనిషికి సంకల్పం ఉంటే ఎంత సాధించగలడో చెప్పే కథే పెద్ది. అలాంటి కథతో ఈరోజు మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. చరణ్ గారికి ఈ కథ చెప్పినప్పుడు, పెద్ది పాత్రను ప్రేక్షకులు తమ మనసుల్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని కోరుకున్నాను. కానీ రామ్ చరణ్ గారు తన అద్భుతమైన నటనతో ఆ పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు. ఒక స్టార్ హీరో ఇంతటి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు.

పెద్ది సెకండ్ హాఫ్ మొత్తం చూస్తే చరణ్ గారి నటన తప్ప ఇంకేమీ కనిపించదు. నేను ఆ పాత్రను ఎంత గొప్పగా ఊహించుకున్నానో, దానికంటే పది రెట్లు ఎక్కువగా చరణ్ గారు చేసి చూపించారు. రామ్ చరణ్ గారిని నేను జీవితాంతం మర్చిపోలేను. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిర్మాత సతీష్ గారు ఈ సినిమా కోసం ఎక్కడా రాజీ పడలేదు. సతీష్ గారు లాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం. అలాగే మా గురువుగారు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన లేకపోతే నేను లేను. నన్ను దర్శకుడిగా పిలవడం కంటే ‘సుకుమార్ గారి అసిస్టెంట్’ అని పిలిస్తే నాకు ఇంకా ఎక్కువ గర్వంగా ఉంటుంది. ఈ సినిమాకు మీరు చూపించిన ఆదరణ, అభిమానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పెద్దికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రతి ప్రేక్షకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.