రివ్యూ : సింగ్ గీతం – సింగీతం,దేవిశ్రీ ప్రసాద్‌ల మ్యాజిక్

Sing Geetham Review in telugu

నటీనటులు : అయాన్, అహిల్యా బమ్రూ,. షాలిని కొండెపూడి, బెనర్జీ
సినిమాటోగ్రఫీ : అనుకూర్ సి
దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : నాగ్ అశ్విన్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ హిస్టరీలోనే కాకుండా ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘మయూరి’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి అల్-టైమ్ క్లాసిక్ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన 90ల వయస్సులో మళ్లీ మెగాఫోన్ పట్టుకుని ఒక సినిమా చేస్తున్నారనే అధికారిక ప్రకటన రాగానే ఇండస్ట్రీ వర్గాలతో పాటు యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అందులోనూ ‘కల్కి 2898 AD’ వంటి గ్లోబల్ విజువల్ వండర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వయంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటంతో ‘సింగ్ గీతం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ :

కుబేర పురం అనే ఊరిలో ఉన్న విలువైన బంగారు గనులను దక్కించుకోవాలని జైలు నుండి వచ్చిన ప్రతాప్ (అయాన్) ప్లాన్ చేయగా, అప్పటికే వాటిని అక్రమంగా ఆక్యుపై చేసి ఊరి జనాన్ని బానిసలుగా వాడుకుంటుంటాడు ప్రెసిడెంట్ బ్రహ్మయ్య (బెనర్జీ). ఈ గనుల వేట, రివెంజ్ డ్రామా ఇలా సాగుతుండగా.. ప్రకృతిని ప్రేమిస్తూ, ఒక పెద్ద చెట్టులో తన చనిపోయిన అమ్మను చూసుకునే గౌరీ (అహిల్యా బమ్రూ) అనే పల్లెటూరి పిల్ల వల్ల ఆ ఊరి మొత్తానికి ఒక వింత శాపం తగులుతుంది; దాంతో ఆ ఊరి జనం మాట్లాడే ప్రతి మాట, భావం ఒక్కసారిగా ‘పాటల’ రూపంలోకి మారిపోతుంది.ఈ విచిత్రమైన మ్యూజికల్ శాపం వెనక ఉన్న రహస్యం ఏంటి, గనుల కోసం జరిగిన పోరాటంలో ప్రతాప్ గెలిచాడా, చివరకు ఆ ఊరి ప్రజలు ఈ వింత సమస్య నుండి ఎలా బయటపడ్డారు అనేదే సరికొత్త ‘మ్యూజికల్ ఫాంటసీ’గా సాగే ఈ చిత్ర పూర్తి కథ.

విశ్లేషణ :

40 ఏళ్ల క్రితమే సింగీతం గారికి వచ్చిన ఈ ఆలోచనను, నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా ఒక అందమైన చందమామ కథలా తెరకెక్కించిన విధానం అద్భుతం. మానవ అత్యాశ, ప్రకృతిని నాశనం చేయడం వంటి బలమైన ఎమోషన్స్ ఇందులో చూపించారు. ఈ సినిమాకు మాటల కంటే సాహిత్యమే ప్రధానం. మాటలను కూడా సాహిత్యంతో నడిపిస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇలాంటి అవుట్‌పుట్ కేవలం డీఎస్పీకే సాధ్యం అనేలా ఆయన వర్క్ ఉంది.

సినిమా ప్రారంభం చాలా ఆసక్తికరంగా, ఒక అందమైన ఫాంటసీ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా ఉంటుంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు కుబేర పురం గ్రామం బ్యాక్‌డ్రాప్‌ను, అక్కడి పాత్రలను పరిచయం చేసిన విధానం బాగుంది. హీరో ప్రతాప్ మన్నెం జైలు నుండి గ్రామానికి తిరిగి రావడం, బంగారు గనుల చుట్టూ నడిచే రాజకీయాలు కథను ముందుకు నడిపిస్తాయి. అయితే, ఎప్పుడైతే హీరోయిన్ గౌరీ వల్ల ఊరి ప్రజల మాటలన్నీ ‘పాటలు’గా మారిపోతాయో, అక్కడ సినిమా సరికొత్త మ్యూజికల్ ఫాంటసీ మోడ్‌లోకి మారుతుంది. ఈ వినూత్నమైన కాన్సెప్ట్ ఫస్టాఫ్‌లో చాలా ఫ్రెష్‌గా, వినోదాత్మకంగా అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన క్యాచీ ట్యూన్స్, పాటల రూపంలో సాగే సంభాషణలు ప్రథమార్ధానికి ప్రధాన బలంగా నిలిచి, ఇంటర్వెల్ కార్డు పడేసరికి కథపై మంచి ఆసక్తిని కలిగిస్తాయి.

ద్వితీయార్ధంలో కథ మరింత ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మానవ అత్యాశ వల్ల ప్రకృతి ఎలా నాశనం అవుతోంది, గ్రామీణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే పాయింట్స్‌ను దర్శకుడు ఎమోషనల్గా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే, ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో కథనం కొంత నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ సినిమా మళ్లీ పుంజుకుంటుంది. ముఖ్యంగా ఊహించని విధంగా వచ్చే విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ క్యామియో రోల్ సెకండాఫ్‌కే కాకుండా మొత్తం థియేటర్‌కే ఒక సాలిడ్ హైలైట్‌గా నిలిచి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.

నటీనటుల పనితీరు :

ప్రతాప్ మన్నెం పాత్రలో అయాన్ చాలా ఈజ్‌తో నటించాడు. నెగటివ్ షేడ్స్ అండ్ రివెంజ్ యాంగిల్ ఉన్న క్యారెక్టర్‌లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్టింగ్ బాగున్నాయి. గౌరీ పాత్రలో అహిల్యా అద్భుతంగా ఒదిగిపోయింది. మ్యూజికల్ శాపానికి కారణమయ్యే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా ఆమె హావభావాలు, ఎమోషనల్ సీన్స్‌లో నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.

రాహుల్ రవీంద్రన్, షాలిని కొండెపూడి: హీరో తండ్రిగా రాహుల్ రవీంద్రన్ క్లాస్ అండ్ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, నెగటివ్ టచ్ ఉన్న రేణు పాత్రలో షాలిని కొండెపూడి తన నటనతో ఆకట్టుకుంది. గనులను హస్తగతం చేసుకుని ఊరి జనాలను వేధించే క్రూరమైన విలన్ ‘బ్రహ్మయ్య’ పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి పర్‌ఫెక్ట్ విలనిజం పండించారు.: క్లైమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ మాసివ్‌గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం, ఆయన చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు :

దర్శకత్వం : 90 ఏళ్ల వయసులో కూడా ఇంతటి వినూత్నమైన ‘మ్యూజికల్ ఫాంటసీ’ ఆలోచనను వెండితెరపైకి తీసుకురావడం సింగీతం గారి విజన్‌కు నిదర్శనం. కథనంలో అక్కడక్కడ చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ, మానవత్వానికి, ప్రకృతికి ముడిపెడుతూ ఆయన కథను ముగించిన విధానం మెప్పిస్తుంది.

సంగీతం : ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నిజమైన హీరో అని చెప్పొచ్చు. ఎందుకంటే మాటల కంటే పాటల రూపంలోనే డైలాగ్స్ సాగాలి. అలాంటి కష్టమైన ప్రక్రియను ఎంతో అలవోకగా హ్యాండిల్ చేస్తూ, ప్రతి పాత్రకు తగినట్లుగా ట్యూన్స్ కంపోజ్ చేయడమే కాకుండా, రీ-రికార్డింగ్ తో విజువల్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేశారు.

సినిమాటోగ్రఫీ : ‘మగధీర’, ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ కుమార్ తన కెమెరా వర్క్‌తో కుబేర పురం గ్రామాన్ని ఒక పెయింటింగ్‌లా విజువల్ వండర్‌గా మార్చేశారు. లైటింగ్ మరియు కలర్ ప్యాలెట్ సినిమా ఫాంటసీ మూడ్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేశాయి.

నిర్మాణ విలువలు : నిర్మాతగా నాగ్ అశ్విన్ అభిరుచిని మెచ్చుకోవాలి. సింగీతం గారి లాంటి లెజెండ్ కలల ప్రాజెక్ట్‌ను నమ్మి, ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను అత్యంత అద్భుతంగా నిర్మించారు.

చివరగా ‘సింగ్ గీతం’ అనేది లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి ఆలోచనకు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి దక్కిన అద్భుతమైన విజయం.ఈ వారాంతంలో ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడదగ్గ ఒక వినూత్నమైన, అందమైన చందమామ కథ ఇది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.