ఆరోజు దిల్ రాజు గారు నన్ను రిజెక్ట్ చేశారు – విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Interesting Comments About Family Star and Producer Dil Raju

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోల్‌సమ్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. ఈ  సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ రిలీజ్‍ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “రాజు గారి బ్యానర్‌లో తొలిసారి ‘కేరింత’ సినిమా ఆడిషన్‌కు వెళ్లాను.సెలెక్ట్ కాలేదు. అలా ఆడిషన్స్ రిజెక్ట్ చేసినవాళ్లందరికీ నేను పేరు తెచ్చుకుని ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా. ఫ్యామిలీ స్టార్‌తో రాజు గారే చెక్ పంపారు. ఆయనకు ఈ సినిమాతో బిగ్ హిట్ ఇచ్చాక మేమంతా హ్యాపీ. ‘గీత గోవిందం’తో ఈ సినిమాకు పోలిక ఉండదు. గీత గోవిందంతో చూస్తే నటుడిగా నేను, దర్శకుడిగా పరశురామ్ ఎంత పరిణితి సాధించామో చూస్తారు” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఖుషి సినిమా దాకా హీరోగా నేను తీసుకున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. ముందు హీరోగా నిలబడాలని మాత్రమే ఆలోచించా. ఎప్పుడూ డబ్బుల కోసం చూసుకోలేదు. కానీ కోవిడ్ టైమ్‌లో నా స్టాఫ్ జీతాలు, మెయింటనెన్స్ ఇవన్నింటికీ ఇబ్బంది కలిగింది. అప్పటి నుంచి మన మార్కెట్ వ్యాల్యూకు తగినట్లు ఫీజు తీసుకోవాలి అనుకుని ఫిక్స్ అయ్యా. రాజు గారు లాక్‌డౌన్‌లో నాకు డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పుడు పంపించారు. అప్పుడే ఆయనకు సినిమా చేయాలని అనుకున్నా” అని అన్నారు.

“ఏప్రిల్ 5న రాజు గారు దిల్ రాజు అయ్యారు. ఈ ఏప్రిల్ 5 డేట్ కూడా ఆయన కెరీర్‌లో స్పెషల్ కావాలి. నెక్ట్ ఏ జానర్ సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉండను. నన్ను అప్రోచ్ అయ్యే డైరెక్టర్స్ చెప్పే కథల్లో బాగుంది అనుకున్నది సెలెక్ట్ చేసుకుంటాం. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం 9 నెలల వర్క్ చేశాం. అంతకు ఏడాది ముందే డైరెక్టర్ సింగిల్ లైన్ చెప్పాడు. ఈ సినిమాకు నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్‌కు ఇస్తా. ఆయన ఒక యూనిక్ రైటర్. గోవర్థన్, ఇందూ క్యారెక్టర్‌లకు సూపర్బ్ గా రాశాడు” అని తెలిపారు.

“పరశురామ్ చెప్పిన లైన్ బాగుందని, అయితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక చేద్దామని రాజు గారికి చెప్పా. ఆయన కొన్ని రోజుల తర్వాత ఫుల్ స్క్రిప్ట్‌తో పరశురామ్‌తో కలిసి వచ్చారు. ఈ టైమ్‌లో నేను డైరెక్టర్ గౌతమ్‌కు, సితార సంస్థకు థ్యాంక్స్ చెప్పాలి. మా కాంబోలో సినిమా బిగిన్ అయ్యింది. అయితే అది బిగ్ స్కేల్ సినిమా. ఫ్యామిలీ స్టార్ 80 డేస్‌లో షూటింగ్ ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు గౌతమ్, సితార వాళ్లకు చెబితే సరేనన్నారు. 80 డేస్ అనుకున్నది 110, 120 డేస్ అయ్యింది. సంక్రాంతికి రాలేకపోయాం. అయినా మంచే జరిగింది. ఏప్రిల్ 5 పర్పెక్ట్ డేట్‌గా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు హీరో విజయ్ దేవరకొండ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 3 =