నార్త్ అమెరికాలో టిల్లు స్క్వేర్ మరో మైల్ స్టోన్

tillu square movie north america collections report

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కలెక్షన్స్ పరంగా ఈసినిమా జోరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఈసినిమాకే దక్కింది. నాలుగు రోజుల్లోనే ఈసినిమా 78 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని 100 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా టిల్లు తన సత్తాను చాటుతున్నాడు. అక్కడ కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్నాడు. ఒక్క నార్త్ అమెరికాలోనే ఈసినిమా 2 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. ఇంకా ముందు ముందు మరింత కలెక్షన్ రాబట్టే అవకాశం గట్టిగానే ఉంది.

కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =