మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నుండి రాబోతున్న సినిమా ఆడు జీవితం. బ్లెస్సీ దర్శకత్వంలో యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. మార్చి 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు టీజర్, ట్రైలర్ లను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చాడు పృథ్వీరాజ్. ఈసినిమా తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల డబ్బింగ్ పూర్తయిందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#AADUJEEVITHAM #TheGoatLife Malayalam (live sound), Tamil, Telugu, Kannada and Hindi dubbing done! To have lived this whole character arc once, and then to revisit it 4 more times in 4 different languages! E-P-I-C!
Relive the unbelievable true story of Najeeb in theatres… pic.twitter.com/elbLCg3tLR— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 14, 2024
కాగా ఈసినిమాలో ఇంకా అమలాపాల్, కేఆర్ గోకుల్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు తెలుగులో రిలీజ్ చేస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: