ఒకప్పుడు టాలీవుడ్ లో బ్యాచ్ లర్ల సంఖ్య ఎక్కువ ఉండేది. అయితే ఇప్పుడు హీరోలు మాత్రం కెరీర్ ను పర్సనల్ లైఫ్ ను రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా ఇప్పుడు మరో యంగ్ హీరో సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ హీరో ఎవరో కాదు కిరణ్ అబ్బవరం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగింది. నటి రహస్య గోరక్ తో ఏంగేజ్ మెంట్ చేసుకున్నాడు కిరణ్. రహస్య గోరక్ ఎవరో కాదు కిరణ్ అబ్బవరం మొదటి సినిమా అయిన రాజావారు రాణిగారు సినిమాలోని హీరోయినే. ఐదేళ్ల ప్రేమ తర్వాత వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#TFNReels: Visuals from the engagement ceremony of @Kiran_Abbavaram & @rahasya_gorak!💍💕#KiranAbbavaram #RahasyaGorak #TeluguFilmNagar pic.twitter.com/HdVJmyV9mC
— Telugu FilmNagar (@telugufilmnagar) March 13, 2024
ఇదిలా ఉండగా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాదే మూడు సినిమాలను రిలీజ్ చేశాడు. వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ ఇలా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో వినరో భాగ్యము విష్ణుకథ ఓమాదిరిగా హిట్ అయినా మిగిలిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























