బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈగల్.. 2 వీక్స్ కలెక్షన్స్ ఎంతంటే?

Ravi Teja's Eagle Collects Over 51.4 Cr Gross by the End of 2nd Weekend

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర హీరోయిన్లుగా నటించగా.. హీరో నవదీప్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన తొలి రోజు మిక్స్‌డ్ టాక్ రావడంతో తొలుత ఈ సినిమా ఫలితంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రవితేజ క్రేజ్ సినిమాను నిలబెట్టింది. ఈ క్రమంలో ఈగల్ మూవీ సక్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం మొత్తం 51 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిందని ఈ మేరకు వారు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. రవితేజ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇందులో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారు. ఇక మిస్టర్ బచ్చన్.. రవితేజ అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని, ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాగా ఇది రూపొందుతోందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 19 =