ఊరు పేరు భైరవకోన.. మా బ్యానర్‌కు నెంబర్ 1 సినిమా అవుతుంది – నిర్మాత రాజేష్ దండా

Ooru Peru Bhairavakona Will be the No 1 Film For Our Banner, Says Producer Rajesh Danda

టాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచరస్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ భారీ బడ్జెట్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత రాజేష్ దండా ‘ఊరు పేరు భైరవకోన’ మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఊరు పేరు భైరవకోన’ ఎలా మొదలైంది?

సందీప్ కిషన్, నేను, విఐ ఆనంద్ మంచి ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యుటర్ గా 12 ఏళ్ల పాటు చేశాను. నిర్మాతగా చేయాలనుకున్నపుడు హాస్య మూవీస్ బ్యానర్‌లో మొదట అనుకున్న సినిమానే ‘ఊరు పేరు భైరవకోన’. నిర్మాతగా చేయాలనుకున్నప్పుడు కథ కొత్తగా వుంటేనే చేయాలని భావించాను. విఐ ఆనంద్ చెప్పిన కథ చాలా డిఫరెంట్‌గా అనిపించింది.

కొత్త కంటెంట్‌తో కొత్త జోనర్‌లో సినిమా చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది, క్రేజ్ వస్తుందని నమ్మి చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైయింది. సందీప్ కిషన్ గారి కెరీర్‌లో హయ్యట్ బడ్జెట్ సినిమా ఇది. అలాగే హయ్యస్ట్ బిజినెస్ సినిమా కూడా ఇదే. విడుదలకు ముందు చాలా హ్యాపీగా వున్నాం. ఆనంద్ గారు చెప్పిన దానికి రెండింతల అద్భుతంగా సినిమాని తీశారు.

బ్యాట్ టు బ్యాక్ హిట్లు కొట్టారు..’ఊరు పేరు భైరవకోన’తో హ్యాట్రిక్ అందుకుంటారనే నమ్మకం ఉందా?

నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాం. ‘ఊరు పేరు భైరవకోన’తో సక్సెస్ ట్రాక్‍ని కొనసాగించి హ్యాట్రిక్ కొడతామనే నమ్మకం వుంది. ప్రీమియర్ షోలన్నీ ఫుల్ అయ్యాయి. హైదరాబాద్‌లో ప్రముఖ సింగిల్ స్క్రీన్స్‌లో ప్రీమియర్స్ అన్నీ ఫుల్ కావడం ఈ సినిమాపై వున్న క్రేజ్‌కి అద్దం పడుతున్నాయి.

ఈ కథలో మీకు నచ్చిన పాయింట్?

‘ఊరు పేరు భైరవకోన’ ఫాంటసీ థ్రిల్లర్. మన ఊర్లో ఏం జరుగుతుందో మనకి తెలుసు. కానీ ‘భైరవకోన’ అనే ఊరులో కొత్తగా వెరైటీగా ఎవరూ ఊహించిన సంఘటనలు జరుగుతుంటాయి. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అలాగే గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి వున్న లింక్ ఏమిటనేది కూడా చాలా ఆసక్తిగా వుంటుంది. సినిమాలో 47 నిమిషాల అద్భతమైన సిజీ వర్క్ వుంది. విజువల్స్ చాలా గ్రాండ్‌గా వుంటాయి. ప్రేక్షకులకు చాలా గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్‌ని ఇచ్చే చిత్రమిది.

అనిల్ సుంకర గారు ఎలాంటి సూచనలు ఇస్తుంటారు?

నేను అనిల్ గారు కలసి చేసిన సినిమాల కథలు ముందు నేను విని నచ్చితే అనిల్ గారు వింటారు. విని ఆయన సలహాలు సూచనలు చేస్తారు. ఇందులో కూడా ఆయన ఓ విలువైన సూచన చేశారు. అది చాలా హెల్ప్ అయ్యింది.

‘ఊరు పేరు భైరవకోన’కి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చెప్పారు?

డైరెక్టర్ గారు చెబితే ఖచ్చితంగా వుంటుంది. అయితే ఇందులో మాత్రం సీక్వెల్ లీడ్ లాంటివి ఏమీ ఇవ్వడం లేదు. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ చేయొచ్చు. రెండు ఆలోచనలు వున్నాయి.

నిజమేనా చెబుతున్నా పాట చాలా పెద్ద హిట్ అయ్యింది కదా.. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర గురించి?

శేఖర్ చంద్ర తన ప్రతి సినిమాలో చాలా మంచి పాటలు ఇస్తారు. ఇందులో నిజమేనా చెబుతున్న పాట చాలా వైరల్ అయ్యింది. నిజానికి ఈ ట్యూన్ శేఖర్ దగ్గర ఐదేళ్ళుగా వుంది. చాలా మందికి వినిపించాడు. ఫైనల్ సందీప్ కిషన్ విని దర్శకుడిని వినమన్నారు. అలా ఆ పాట మాకు రావడం చాలా లక్కీ. ఇందులో నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది.

‘ఊరు పేరు భైరవకోన’లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న మూమెంట్స్?

‘భైరవకోన’ ఊరు గురించి చెప్పడం ఆసక్తికరంగా వుంటుంది. తర్వాత ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా వుంటాయి. ‘భైరవకోన’లోకి ఎంటరైన తర్వాత జర్నీ అంతా థ్రిల్లింగా వుంటుంది.

ఈ సినిమా కోసం సందీప్ కిషన్ చాలా హార్డ్ వర్క్ చేశారు కదా? తనకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందని భావిస్తున్నారు?

సందీప్ కిషన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తనే ఈ సినిమాకి హెల్ప్ అయ్యాడనే విధంగా చేశాడు. తన కెరీర్‌కి, మా బ్యానర్‌కి ఇది నెంబర్ 1 సినిమా అవుతుందనే నమ్మకం వుంది.

కొత్తగా చేస్తున్న చిత్రాలు?

అల్లరి నరేష్ గారితో ‘బచ్చల మల్లి’ షూటింగ్ జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరంతో ఓ సినిమా చేయబోతున్నాం.

ఆల్ ది బెస్ట్

థాంక్ యూ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 7 =