అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు రివ్యూ..ఎమోషనల్ విలేజ్ డ్రామా

ambajipeta marriage band telugu movie review

దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా టీజర్, ట్రైలర్ లతోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..సుహాస్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, శివాని నాగరం, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు
దర్శకత్వం.. దుశ్యంత్ కటికనేని
బ్యానర్స్.. గీతా ఆర్ట్స్2, ధీరణ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు..ధీరజ్ మొగిలినేని
సినిమాటోగ్రఫి..వాజిద్ బేగ్
సంగీతం..శేఖర్ చంద్ర

కథ..

ఈసినిమా కథ అంజాబీపేట అనే ఊరిలో జరిగిన కథ. అంబాజీపేట ఊరిలో ట్విన్స్ మల్లికార్జున్ (సుహాస్), పద్మావతి(శరణ్య ప్రదీప్) ఉంటారు. మల్లికార్జున్ తన తండ్రి సెలూస్ షాప్ ను చూసుకుంటూనే మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేస్తుంటాడు. ఇక పద్మావతి స్కూల్ టీచర్ గా పనిచేస్తుంటుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద మనిషిలా చెలామణి అయ్యే వెంకట్. ఈ వెంకట్ చెల్లి అయిన లక్ష్మీని (శివానీ నాగారం) ని ప్రేమిస్తాడు. ఆ విషయం తెలిసిన వెంకట్ సుహాస్ సోదరి అయిన పద్మను వేధించడం మొదలుపెడటాడు. దాంతో తనకు ఎదురొచ్చిన మల్లిని కూడా ఘోరంగా అవమానిస్తాడు. దీంతో ఊర్లో తలెత్తుకోలేని స్థితికి చేరుకుంటుంది వీరి కుటుంబం. తమ ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు మల్లి.. పద్మ ఏం చేశారు.. వీరి జీవితాలు చివరికి ఎలాంటి మలుపు తిరిగాయి.. మల్లి,లక్ష్మీ ల ప్రేమ గెలుస్తుందా? అన్నది మిగతా కథ.

విశ్లేషణ

సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ వీడియో ద్వారానే పాపులారిటీ సొంతం చేసుకున్న సుహాస్ ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించాడు. ఆతరువాత కలర్ ఫొటో సినిమాతో హీరోగా సైతం మారిపోయాడు. ఆ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో వచ్చాడు ఆసినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. ఇప్పుడు అంజాబీపేట మ్యారేజీ బ్యాండు అనే సినిమాతో వస్తున్నాడు.

ఈసినిమాపై కూడా మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథా ప్రాధాన్యమైన సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అంజాబీ పేట మ్యారేజ్ బ్యాండు సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. అయితే ఈసినిమా స్టోరీ లైన్ చూస్తే పాత తరం నుండి ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. జాతి వివక్షత.. పేదింటి కుర్రోడు రిచ్ అమ్మాయిని ప్రేమించడం ఆ తరువాత ప్రాబ్లమ్స్ చాలా సినిమాల్లో చూశాం. అదే పాయింట్ ను తీసుకొని కాస్త ఎంగేజింగా కథను రాసుకొని తీయడంతో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పెద్దింటి వాళ్లు తక్కువ కులం వారిని అవమానించడం, అప్పుల పేరుతో ఆస్తులు లాక్కోవడం, పేద, ధనికుల మధ్య ప్రేమ చూపించాడు. అయితే ఈ సినిమాలో అత్మాభిమానం కోసం పోరాటం హైలైట్‌గా చూపించాడు.

పెర్ఫామెన్స్

ఇలాంటి సినిమాలకు కథ కంటే కూడా పాత్రల పెర్ఫామెన్సే ప్రధాన బలం. ఇక మల్లి పాత్రకు సుహాస్ పర్పెక్ట్ యాప్ట్. సుహాస్ తప్పా ఈ పాత్రకు మరేవరూ న్యాయం చేయలేరేమో అన్నత రేంజ్ లో నటించాడు. పాత్రలోని వేరియేషన్స్ చాాలా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో అల్ల‌రి అబ్బాయిగా ఎలా ఒదిగిపోయాడో.. సెకండాఫ్‌లో ఇంటెన్సిటీలో క‌నిపించి మెప్పించాడు. శరణ్య ప్రదీప్ కు ఈసినిమాతో మరో పాత్ర ప్రధానమైన రోల్ దక్కిందని చెప్పొచ్చు. తను కూడా చాలా బాగా నటించింది. ఇక హీరోయిన్ గా శివానీ నాగారం కూడా తన నటనతో మెప్పించింది. వెంకట్‌ పాత్రలో నితిన్‌ అదరగట్టాడు. గోపరాజు రమణ తనదైన పాత్రతో మెప్పించాడు.ఇక జగదీష్ ప్రతాప్ బండారి, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక విభాగం

ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా ప్రధాన బలమైంది. శేఖర్‌ చంద్ర అందించిన మ్యూజిక్‌ సినిమాకు పెద్ద ప్లస్‌ అయింది. సినిమాకి బ్యాక్‌ బోన్‌లా నిలిచింది. మరోవైపు వాజిద్‌ బయాగ్‌ సినిమాటోగ్రాఫర్‌ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి ఎమోషనల్ మూవీని చూడాలనుకుంటే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా మంచి ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు ఈసినిమాను చూసి ఎంజాయ్ చెయొచ్చు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 1 =