రివ్యూ.. ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే గేమ్ ఆన్

game on movie telugu review

దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన సినిమా గేమ్ ఆన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సైతం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన ఈసినిమా ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ తదితరులు.
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : అర‌వింద్ విశ్వనాథ‌న్‌
ఎడిటర్ : వంశీ అట్లూరి
సంగీతం : అభిషేక్ ఏ.ఆర్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్
ఆర్ట్ డైరెక్టర్: విఠ‌ల్‌
నిర్మాత : రవి కస్తూరి
కథ,మాటలు,స్క్రీన్ ప్లే, ద‌ర్శకత్వం: దయానంద్
విడుదల తేదీ: 02–02–2024

కథ
లూజర్ గా ఉన్న వ్యక్తి విన్నర్ గా ఎలా మారాడనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇందులోనే మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ కూడా చూపించారు. ప్రేమగా చూసుకునే తల్లి వేరే పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఆ తల్లిపై ద్వేషం పెంచుకుంటాడు కొడుకు. ఆ కోపంతో సైకో గా మారి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కొడుతూ ఉంటాడు. ఒకరిని క్రూరంగా చంపేస్తాడు. ఆ మర్డర్ ను తాత పై వేసుకుని మనవడిని తప్పిస్తాడు. తర్వాత ఆ హీరో ఎలా పెరిగాడు? ఎలా మారాడు? ఏం చేస్తాడు? ఏ విధంగా ప్రవర్తిస్తాడు? ఇందులో భాగంగానే తను ఒక గేమ్ ట్రాప్ లో చిక్కుకుంటాడు. ఒకానొక సందర్భంలో చనిపోదాం అనుకునే హీరోను ఆ గేమ్ ఎలా మార్చింది.. తన తల్లిని ఏ విధంగా కలుసుకుంటాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ
డిఫరెంట్ కాన్సెప్ట్ లను యాక్సెప్ట్ చేయడంలో ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో అది నిరూపించారు. ఇక ఇప్పుడు మరోసారి గేమ్ ఆన్ సినిమాలో రుజువు చేశారు. ఇప్పటి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని కొత్త కథను తీసుకొని దానికి ఎమోషన్స్ ను జోడించి గేమ్ ఆన్ ను చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ దయానంద్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమాను ఆద్యంతం ఉత్కంఠంగా తెరకెక్కించారు. దర్శకుడిగా మొదటి సినిమా అయినా.. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లా దయానంద్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రియల్ టైం సైకలాజికల్ థ్రిల్లర్ గా కొనసాగుతూ ఆడియోన్స్ లో క్యూరియాసిటీని పెంచాలా ఉంది. యాక్షన్, రొమాన్స్ తో పాటు సెంటిమెంట్ ను జోడించి ప్రోపర్ కమర్షియల్ చిత్రంగా రూపొందించారు.

పెర్ఫామెన్స్
హీరో గీతానంద్ సెటిల్డ్ పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటాడు. యాక్షన్ తోపాటు ఎమోషన్ ను కూడా బాగా పండించాడు. తనదైన మేనరిజంతో ఇంప్రెస్ చేశాడు. హీరోయిన్ నేహా సోలంకి గ్లామర్ లుక్ తో యూత్ ను అట్రాక్ట్ చేసేలా కనిపించింది. సిగరెట్ మందు తాగుతూ మాసీ గానూ మెస్మరైజ్ చేసింది. చాలా రోజుల తర్వాత సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ కీలక పాత్ర పోషించారు. సినిమా ఓపెనింగే ఆయన క్యారెక్టర్ ని చూపిస్తూ ప్రారంభమవుతుంది. సీరియస్ ఇంటెన్స్ పాత్రను పోషించారాయన. హీరో తల్లి పాత్రలో మధుబాల ఇంపార్టెంట్ రోల్ చేశారు. డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆమె ఆకట్టుకున్నారు. ఆదిత్య మీనన్ సైకాలజిస్ట్ గా కనిపించారు. ఆయన క్యారెక్టర్ సినిమాకు కీలకం. ఆయన పోషించిన తీరు ఆయన హావభావాలు ఆయన లుక్ ప్రెజెన్స్ సూపర్బ్ గా ఉంటాయి. ఇక కిరీటి, వాసంతి తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం
టెక్నికల్ విషయానికొస్తే ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా చిత్రీకరించారు. సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్ అందించిన విజువల్స్ మెప్పిస్తాయి. సినిమా అంతా రేసీగా సాగేలా ఎడిటర్ వంశీ అట్లూరి ఎడిటింగ్ చేశారు. అభిషేక్ ఏ ఆర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. రిచ్ రిచ్ సాంగు చాలా లావిష్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లు చాలా కొత్తగా ఉంటాయి. రామకృష్ణ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీలో హీరోని డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నిర్మాత రవి కస్తూరి కి కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా.. బడ్జెట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల వారు ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చెయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =